Manchu Manoj | తండ్రి కాబోతున్న మనోజ్ .. మంచు ఫ్యామిలీ కి మరో వారసుడు.?

Manoj Mounika | మంచు మనోజ్ మౌనిక ఈ మధ్యనే పెద్దల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరికి అది రెండో పెళ్లి.అయితే ఈ పెళ్లి చేసుకోవడంలో వీరి ఇంట్లో ఎన్నో గొడవలు జరిగినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు ఇంట్లో వాళ్ళని ఒప్పించి మంచు మనోజ్ భూమా మౌనిక మెడలో మూడు ముళ్ళు వేశారు. అయితే మంచు ఫ్యామిలీ మౌనికను యాక్సెప్ట్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఆమెకు మనోజ్ లాగే పెళ్లి అయిపోయినప్పటికీ కూడా ఒక కొడుకు ఉండడం.

Manchu Manoj Announced Good News
Manchu Manoj Announced Good News

మంచు ఫ్యామిలీ వైసిపి పార్టీకి సపోర్ట్ గా ఉంటుంది కానీ భూమా ఫ్యామిలీ టిడిపి పార్టీకి సపోర్ట్ గా ఉంటుంది. కాబట్టి రాజకీయ వ్యతిరేకత వల్ల కూడా మంచు ఫ్యామిలీ వారి పెళ్లికి ఒప్పుకోలేదు.కానీ ఏది ఏమైనప్పటికి వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. గతంలో భూమా మౌనికకు తన మొదటి భర్తతో ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే.

అయితే మనోజ్ ను పెళ్లి చేసుకున్నాక ఆ బాబు తనవద్దే పెరుగుతున్నాడు. అయినప్పటికీ కూడా మౌనికతో కూడా మనోజ్ మరో బిడ్డను ప్లాన్ చేసుకున్నాడని సందేహాలు వినిపిస్తున్నాయి.మనోజ్ కు (Manoj) తన మొదటి భార్య ద్వారా సంతానం లేరు. పెళ్లి తర్వాత 2019లో తనతో మనోజ్ (Manchu manoj) విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం రెండవ భార్య అయినా మౌనిక తాజాగా ప్రెగ్నెంట్ అనే వార్తలు టాలీవుడ్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి మంచు – భూమా కుటుంబాలకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. మంచు మనోజ్ మౌనికల పెళ్లి మోహన్ బాబుకు అసలు ఇష్టం లేదని వారి పెళ్లి సమయంలో ప్రచారం జరిగింది. అందుకే మోహన్ బాబు వారి పెళ్లి టైంలో దూరంగా ఉన్నారని వార్తలు వినిపించాయి.

Leave a Reply