Manoj Mounika | బయటపడిన భూమా మౌనిక సీక్రెట్ టాటూ.. షాక్ లో మంచు మనోజ్..!!

Manoj Mounika | మంచు మనోజ్ మౌనిక (Bhuma mounika) ఈ మధ్యనే పెద్దల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరికి అది రెండో పెళ్లి.అయితే ఈ పెళ్లి చేసుకోవడంలో వీరి ఇంట్లో ఎన్నో గొడవలు జరిగినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు ఇంట్లో వాళ్ళని ఒప్పించి మంచు మనోజ్ భూమా మౌనిక మెడలో మూడు ముళ్ళు వేశారు. అయితే మంచు ఫ్యామిలీ మౌనికను యాక్సెప్ట్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఆమెకు మనోజ్ లాగే పెళ్లి అయిపోయినప్పటికీ కూడా ఒక కొడుకు ఉండడం.

మంచు ఫ్యామిలీ వైసిపి పార్టీకి సపోర్ట్ గా ఉంటుంది కానీ భూమా ఫ్యామిలీ టిడిపి పార్టీకి సపోర్ట్ గా ఉంటుంది. కాబట్టి రాజకీయ వ్యతిరేకత వల్ల కూడా మంచు ఫ్యామిలీ వారి పెళ్లికి ఒప్పుకోలేదు.కానీ ఏది ఏమైనప్పటికి వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ మధ్యనే నూతన గృహప్రవేశం కూడా చేశారు. ఇక వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ కార్యక్రమాలలో భాగంగా భూమా మౌనిక వీపుపై ఉన్నటువంటి సీక్రెట్ టాటూ బయటపడటంతో మంచు మనోజ్(Manchu manoj) షాక్ అయినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయం గురించి వార్తలు వస్తున్నాయి.ఇలా మౌనిక పూజ చేస్తున్న సమయంలో తన వీపుపై ఉన్నటువంటి టాటూ చూసిన మనోజ్ మౌనిక పట్ల కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.ఇంతకీ మౌనిక వీపుపై ఉన్నటువంటి టాటూ ఎవరిది అసలు టాటూ (Tattoo) సీక్రెట్ ఏంటి అనే విషయానికి వస్తే.

మనోజ్ మౌనికను వివాహం చేసుకోవడానికి ముందే గణేష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు.అయితే ఈ వివాహ సమయంలో ఈమె తన భర్త పేరును టాటూగా వేయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయాలన్నీ మంచు మనోజ్ కు తెలిసి తనని వివాహం చేసుకున్నారు కనుక ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేవని వారిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారని ఇవన్నీ కేవలం ఒట్టి పుకార్లేనట్టు కొందరు ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు.

Leave a Reply