JR NTR | భార్య ప్రణతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..?కారణం ఇదే.

JR NTR | జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటన, డ్యాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత విషయానికి వస్తే… జూనియర్ ఎన్టీఆర్ 2011, మే 5వ తేదీన లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు.

వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. లక్ష్మీ ప్రణతి చాలా సాంప్రదాయంగా ఉంటుంది. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతికి 2014, జులై 22న అభయ్ రామ్ అనే అబ్బాయి జన్మించాడు. ఇక ఎన్టీఆర్ కి అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. ఇక రెండవ సంతానంగా కూతురు పుడుతుందని చాలా ఆశపడ్డాడట. కానీ మళ్ళీ రెండవ సంతానం కూడా అబ్బాయి జన్మించాడు. దీంతో ఎన్టీఆర్ కోరిక తీరలేదు.

ఇక లక్ష్మీ ప్రణతి తన భర్త కోరిక తీర్చాలని మూడవ బిడ్డను కనేందుకు సిద్ధమయ్యిందట.ఈ క్రమంలోనే డాక్టర్ లక్ష్మీ ప్రణతికి నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. ఇద్దరు పిల్లలు సరిపోతారు కదా. మళ్లీ మూడో బిడ్డ ఎందుకు అని సర్ది చెప్పారట. అయినా కూడా లక్ష్మీ ప్రణతి వినకుండా మూడో బిడ్డ కావాలని ఒత్తిడి చేసిన చేసిందట. దీంతో ఎన్టీఆర్ ముందు నీ ఆరోగ్యం ముఖ్యం. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా చాలు అని స్ట్రాంగ్ గా లక్ష్మీ ప్రణతికి వార్నింగ్ ఇచ్చారట. దీన్ని బట్టి ఎన్టీఆర్ కి తన భార్యపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://youtu.be/MLbO-nN6iEQ

Leave a Reply