Bus Fight | భార్యలకు సీటు కోసంజుట్లు పట్టి కొట్టుకున్నారు..

Bus Fight | భార్యల కోసం భర్తలు.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అది కూడా బస్సులో సీటు కోసం ఈ గొడవ జరిగింది. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక బస్సు ఎక్కిన ఇద్దరు మగాళ్లు.. నా భార్యకు సీటు కావాలంటే.. లేదు నా భార్యకే సీటు కావాలంటూ గొడవకు దిగారు. వీరికి మద్దతుగా భార్యలు కూడా రంగంలోకి దిగడంతో గొడవ తారాస్థాయికి చేరింది.

ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అంటే తెలంగాణలో తొర్రూరు డిపోకు చెందిన ఎక్స్‌స్రెస్‌ బస్సు తొర్రూరు నుంచి ఉప్పల్‌ క్రాస్‌రోడ్డుకు వెళ్లేందుకు స్థానిక బస్టాండ్‌లో మంగళవారం సాయంత్రం వేచి ఉంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో కర్చీఫ్‌లు వేసి సీట్లు ఆపుకున్నారు. అయితే బస్సులోకి ఎక్కాక వేరే ప్రయాణికులు కూర్చోవడంతో సీటు మేము ఆపామంటే మేము ఆపామని ఇద్దరు మహిళా ప్రయాణికులు గొడవకు దిగారు. ఇది గమనించిన వారి భర్తలు ఒకరిపై ఒకరు చెప్పులతో బస్సులోనే దాడి చేసుకున్నారు. ఇక తోటి ప్రయాణికులు వారిని ఆపే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు.

భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు వారిని కిందకు దింపారు. కిందకు దిగినా దాడి ఆపలేదు. మరోసారి ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది 100కు డయల్‌ చేయడంతో పోలీసులు వచ్చి ఇరువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ గొడవను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

Recent Posts

Leave a Reply