Rashmika | అతనితో నాకు ఎప్పుడో పెళ్లైపోయింది..!రష్మిక సంచలన కామెంట్స్,

కన్నడ భామ రష్మిక మందన (Rashmika Mandanna). తన అందం, నటనతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ సహా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది. కాగా, రష్మిక గురించి కొన్ని రోజులుగా ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ లో ఉందంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది.

Rashmika Mandanna
Rashmika Mandanna

వీరిద్దరూ తరచూ పార్టీలు, వెకేషన్స్ అంటూ కలిసి కనిపించడంతో మీడియాలో కూడా వీరి రిలేషన్ గురించి వరుస కథనాలు వచ్చాయి. అయితే ఆ రూమర్స్ ను ఇద్దరూ కొట్టి పారేశారు. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడికి పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. రీసెంట్ గా రష్మిక బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి మూవీ ప్రమోషన్స్ కు వెళ్ళింది.

అక్కడ ఈ అమ్మడికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దాంతో ఆమె ఫన్నీగా రిప్లే ఇచ్చింది. నా ఆల్రెడీ పెళ్లి అయిపొయింది. నేను Naruto నరుటోను పెళ్లి చేసుకున్నా.. అతనంటే నాకు చాలా ఇష్టం.. నా మనసంతా అతనే ఉన్నాడు అని తెలిపింది. నరుటో అంటే ఎనిమీ సిరీస్‌లోని ఒక పాత్ర. ఆ పాత్ర కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ చిన్నది కూడా నరుటో ఫ్యాన్ అని తెలిపింది. దాంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Rashmika Mandanna
Rashmika Mandanna

Leave a Reply