Rashmika Mandanna | అసిస్టెంట్ పెళ్ళిలో హల్ చల్ చేసిన రష్మిక ..! వైరల్ వీడియో

Rashmika Mandanna | రష్మిక మందన్నగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం వరస భాష చిత్రాలలో నటిస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగడమే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలలో అవకాశాలు అందుకొని వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక.

తాజాగా త‌న మేక‌ప్ అసిస్టెంట్ పెళ్లికి హాజ‌రైంది. అక్క‌డ ఈ క‌న్న‌డ భామ చేసిన సంద‌డి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ర‌ష్మిక మేక‌ప్ అసిస్టెంట్ పెళ్లి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ పెళ్లికి ప‌సుపు రంగు చీర క‌ట్టుకుని సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో హాజ‌రైంది. కొత్త దంప‌తుల‌కు ర‌ష్మిక శుభాకాంక్ష‌లు చెప్పింది. వారు ఆమె కాళ్లు మొక్కారు. దీంతో ఆమె కాస్త కంగారు ప‌డింది. ఆ త‌రువాత వాళ్ల‌ను ఆశీర్వ‌దించారు. ఈ వీడియోను ప్ర‌స్తుతం నెట్టింట తెగ షేర్ చేసుకుంటున్నారు.

దీనిపై నెటీజ‌న్లు స‌ర‌దా కామెంట్లు చేస్తున్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ అసిస్టెంట్ పెళ్లికి హాజ‌రు కావ‌డంపై నెటీజ‌న్లు ప్ర‌సంశ‌లు కురిపిస్తున్నారు.అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా రష్మిక ఆరెంజ్ రంగు చీర ధరించి వచ్చారు.

ఇలా ఈ చీరలో రష్మిక సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా స్టైలిష్ గా కనిపించారు.ఈ విధంగా అసిస్టెంట్ పెళ్లి వేడుకలలో రష్మిక కట్టుకున్నటువంటి ఈ చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనిత డోంగ్రి డిజైన్ చేశారు.ఈ చీర ఏకంగా 35 వేల రూపాయల ధర అని తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

Leave a Reply