Minister Roja | పీకే అంటే పిచ్చి కళ్యాణ్.. పవన్ కి రోజా కౌంటర్..

Minister Roja | స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ కలిసిన అనంతరం ఓ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రకటించారు. ఈ విషయం అటు టీడీపీ శ్రేణులు, ఇటు జనసేన నేతలకు మింగుడు పడకపోయినా.. వైసీపీని ఓడించాలన్న ఉద్దేశంతో కిమ్మనకుండా ఉండిపోయారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత’ అంటూ ఓ ముఖ్యమంత్రినుద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి రోజా మండిపడ్డారు. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని సీఎం జగన్ అనేంతటివాడివా నువ్వు…

ముందు నీ బతుకేంటో చూసుకో .. పీకే అంటే పిచ్చి కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్క్ రోజా ఘాటుగా విమర్శించారు.జగన్ కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇప్పటిదాకా వార్డు మెంబర్ గా కూడా గెలవలేకపోయాడని రోజా ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల జెండాలు మోసే కూలీ పవన్ కల్యాణ్ అని, తన స్థాయికి మించి మాట్లాడడం తగదని హితవు పలికారు. జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరిలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.

Also Read |  మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న విజ‌య‌శాంతి..?

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ 13 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచారని, మరో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని రోజా వెల్లడించారు. జగన్ ఒకసారి విపక్ష నేతగా ఉన్నారని, ఆ తర్వాత 151 మంది ఎమ్మెల్యేల బలంతో సీఎం పీఠం అధిష్ఠించారని వివరించారు.

Leave a Reply