Tarun | సిగ్గు ఉండాలి.. నిహారికతో పెళ్లి వార్తలపై స్పందించిన నటుడు తరుణ్..!

Tarun | టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్ లో తరుణ్ ఒకరు. ఇప్పుడు ఆయన వయస్సు 40 ఏళ్ళు. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి, హీరోగా మారిన తరుణ్ ‘నువ్వే కావాలి’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’ వంటి సినిమాలతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ఆయన ప్రేమ, పెళ్లికి సంబంధించి అప్పట్లో రకరకాల వార్తలు వినిపించేవి.

కొన్నేళ్లుగా సినిమాలు చేయకపోవడంతో ఈమధ్య ఆయన పెద్దగా వార్తల్లో లేరు. అయితే ఉన్నట్టుండి తరుణ్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అది కూడా ఇటీవల విడాకులు తీసుకున్న మెగా డాటర్ నిహారిక తో తరుణ్ పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి వార్తలపై తరుణ్ క్లారిటీ ఇచ్చారు.ఇవన్నీ అపోహలు మాత్రమే. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు.

Hero Tarun Marriage
Hero Tarun Marriage

అలాంటి గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే నేనే నేరుగా లేదా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాను. ఫలానా వ్యక్తితో నా వివాహం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చేశారు.తరుణ్ తల్లి రోజారమణి కూడా ఆర్టిస్ట్. కొన్ని చిత్రాల్లో నటించారు. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. తల్లి నటవారసత్వాని తీసుకుని తరుణ్ నటుడు అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా తరుణ్ సంచలనాలు చేశాడు. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. బాలకృష్ణ, రజినీకాంత్ తో పాటు పలువురు టాప్ హీరోల చిత్రాల్లో నటించారు.

Leave a Reply