Marriage Age | 30+ వయసు దాటాక పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తప్పక తెల్సుకోండి.

Marriage Age: ఈడంత పోయినాక పెళ్లెందుకు.. ఆకలంత పోయినాక అన్నమెందుకు అంటారు. ఏ వయసులో జరగాల్సిన అచ్చటముచ్చట ఆ వయసులో జరగాలి. లేకపోతే కష్టమే. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నా వివాహం మాత్రం కచ్చితంగా సరైన సమయానికే చేసుకుంటే బాగుంటుంది. దీని కోసం యువత సిద్ధమవ్వాలి. ఉపాధి దొరికిన తరువాత చేసుకుంటానని వాయిదా వేసుకుంటే అది కుదరదు. పెళ్లి అనేది వాయిదా వేస్తే మనకు ఇబ్బందులు తప్పవు.

అప్పటికే బంధువులు, తల్లిదండ్రులు ఒకటే గోల చేస్తారు. ఎప్పుడు చేసుకుంటావని నిలదీస్తారు. అందుకే వారికి అవకాశం ఇవ్వకుండా మనమే సమయానికి తంతు పూర్తయ్యేలా చూసుకోవాలి. ఈడు, జోడు, గుణం అన్ని ఉండాలంటే కుదరదు. ఏవో కొన్ని కావాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదని తెలుసుకోవాలి. అయితే 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.

*ఈ ఏజ్ గ్రూప్ లో జీవితం పై పూర్తి స్పష్టత వస్తుంది. వీలైనంత వరకు కెరియర్ పై ఫోకస్ చేసి డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు. దాంతో వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టడం కష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

*ఒకరిపై ఒకరికి ఆకర్షణ తగ్గిపోతుంది. దాంతో వైవాహిక జీవితం చాలా డల్ గా సాగుతుంది అని నిపుణులు అంటున్నారు.

*వేరే విషయాల మీదకి, అంటే ఉద్యోగం, డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోవడంతో ఒకరిపై ఒకరికి శ్రద్ధ పెట్టే సమయం చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వేరే రిలేషన్ షిప్ వైపు ఫోకస్ వెళ్లే అవకాశాలు ఉంటాయట.

*సమాజం నుండి వచ్చే ఒత్తిడి గురించి మనందరికీ తెలుసు. ఎవరినైనా సరే తొందరగా జడ్జ్ చేయడంలో చాలా మంది ముందుంటారు. దాంతో ఒకవేళ మైండ్ కొంచెం సున్నితంగా ఉన్న వాళ్ళు అయితే సమాజం నుండి వచ్చే ఒత్తిడిని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాని వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదురు అవుతూ ఉంటాయి.

*సమాజం నుండి వచ్చే ఒత్తిడి గురించి మనందరికీ తెలుసు. ఎవరినైనా సరే తొందరగా జడ్జ్ చేయడంలో చాలా మంది ముందుంటారు. దాంతో ఒకవేళ మైండ్ కొంచెం సున్నితంగా ఉన్న వాళ్ళు అయితే సమాజం నుండి వచ్చే ఒత్తిడిని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాని వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదురు అవుతూ ఉంటాయి.

Leave a Reply