Story: కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌ను ఆషాఢంలో దూరంగా ఉంచడానికి కారణం ఇదే..!

ఆషాడ మాసం

అందంగా పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టుకుని ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకుని, అష్టమాసం అని పిలిచి దూరంగా ఉంచి కొత్త జంటను నిరాశ పరిచినప్పుడు ఈ పెద్దలు ఇలా ఎందుకు చేస్తారు? వారి పని ఏమిటి లేదా ఇలా జంటను విడదీయడం మహాపాపం మరియు నేరమా? కానీ మూఢనమ్మకాలు వ్యాపిస్తోందని చెప్పే వారికి సైన్స్ లాగా దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటో తెలియదు. అసలు ఆషాఢమాసంలో కొత్త జంటలు ఎందుకు విడిపోతారు?

ఆషాఢ మాసంలో వాతావ‌ర‌ణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌టం ద్వారా బ్యాక్టీరియా, వైర‌స్‌లు పెరిగి అంటువ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఇలాంటి స‌మ‌యంలో కొత్త పెళ్లి కూతురు గ‌ర్భం దాలిస్తే పుట్ట‌బోయే బిడ్డ‌పై ఆ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఎందుకంటే పిండానికి తొలి మూడు నెల‌లు చాలా కీల‌క‌మైన స‌మ‌యం. ఆ స‌మ‌యంలోనే అవ‌య‌వాలు ఏర్ప‌డ‌టం మొద‌ల‌వుతుంది.

ఇలాంటి స‌మ‌యంలో త‌ల్లి అంటువ్యాధుల బారిన ప‌డితే క‌డుపులోని బిడ్డపై కూడా ఆ ప్ర‌భావం ప‌డుతుంది. అది కాకుండా ఆషాఢంలో గ‌ర్భం వ‌స్తే.. మండు వేస‌విలో కాన్పు ఉంటుంది. అంటే ఆ ఎండ తీవ్ర‌త‌ను త‌ల్లీ బిడ్డ ఇద్ద‌రూ త‌ట్టుకోలేరు.

దీంతో ఇద్ద‌రికీ అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుకే ఆషాఢంలో కొత్త‌గా పెళ్ల‌యిన భార్యాభ‌ర్త‌ల‌ను దూరంగా ఉంచుతారు. అదీకాకుండా పెళ్ల‌యిన కొత్త‌లో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య విప‌రీత‌మైన ప్రేమ‌, ఆక‌ర్ష‌ణ ఉంటాయి. అలాంటి స‌మ‌యంలో నెల రోజుల పాటు దూరం ఉంటే.. ఎడ‌బాటు వ‌ల్ల క‌లిగే బాధేంటో వారికి అర్థ‌మ‌వుతుంది. దీంతో వాళ్లు జీవితాంతం అన్యోన్యంగా ఉంటార‌ని అలా చేస్తారు.

Leave a Reply