బాదం పప్పు తినేముందు ప్రతి ఒక్కరు ఒకసారి ఈ వీడియో చూడండి..!

Cashews And Almonds

బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు వంటి డ్రైఫ్రూట్స్ ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని మ‌నంద‌రికి తెలుసు. వైద్యుల కూడా వీటిని ఆహారంగా తీసుకోమ‌ని సూచిస్తూ ఉంటారు. ఈ బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటాయి. తిన్నా కొద్ది తినాల‌నిపించేత రుచిగా ఇవి ఉంటాయి. చాలా మందికి వీటి మీద చాలా అపోహాలు ఉన్నాయి.

ఈ డ్రైఫ్రూట్స్ ను ఎవ‌రు ప‌డితే వారు తీసుకోకూడ‌ద‌ని, వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌స‌మ్య‌లు వ‌స్తాయ‌ని, ఇవి స‌రిగ్గా జీర్ణ‌మ‌వ్వ‌వ‌ని మ‌న‌లో చాలా మంది భావిస్తూ ఉంటారు. బాదం, జీడిప‌ప్పు వంటి డ్రైఫ్రూట్స్ ను సంవ‌త్స‌రంన్న‌ర పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి ముస‌లి వారి వ‌ర‌కు ఎవ‌రైనా తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.వీటిని జీర్ణించుకోగ‌లిగే శ‌క్తి ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంద‌ని వారు చెబుతున్నారు.

ఈ డ్రైఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా ప్రోటీన్స్ మ‌రియు శ‌రీరానికి మేలు చేసే కొవ్వులు ఎక్క‌వ‌గా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే చాలా మంది ఈ డ్రైఫ్రూట్స్ ను నెయ్యితో, నూనెలో వేయించి మ‌సాలా, ఉప్పు ,కారం చ‌ల్లుకుని తింటూ ఉంటారు. ఇలా తిన‌డం వ‌ల్ల మన శ‌రీరానికి హాని క‌లుగుతుంది.

డ్రైఫ్రూట్స్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వాటిని నాన‌బెట్టి తీసుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మైన మార్గ‌మ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.నాన‌బెట్ట‌కుండా ఈ డ్రైఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో ఉండే పోష‌కాలను 70 శాతం మాత్ర‌మే మ‌న ప్రేగులు గ్ర‌హిస్తాయి. మిగిలిన 30 శాతం పోషకాలు మ‌లం ద్వారా వ్య‌ర్థాల రూపంలో బ‌య‌ట‌కు పోతాయి. మ‌నం నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల అవి సుల‌భంగా అలాగే త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి.

అదేవిధంగా వీటిని కనీసం ఒక రాత్రంతా లేదా 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. ఇలా నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను వాటి పై ఉండే తొక్క‌ను తీసుకుని తినాలి. అలాగే వీటిని మ‌న అవ‌స‌రాన్ని బ‌ట్టి, మ‌న ఆక‌లిని బ‌ట్టి, మ‌నకు కావ‌ల్సిన శ‌క్తిని బ‌ట్టి వీటిని ఒక్కొక్క‌టి 10 గింజ‌ల నుండి 30 గింజ‌ల ప‌రిమాణంలో కూడా తీసుకోవ‌చ్చు. మాంసం, చేప‌ల కంటే కూడా ఈ డ్రైఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ శ‌క్తితో పాటు ఎక్కువ‌గా ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply