Payal Ghosh | అందాలను బయటపెడుతూ అందరికీ షాక్ ఇచ్చిన ఊసరవెళ్లి హీరోయిన్ ..

Payal Ghosh | యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన “ఊసరవెల్లి” సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ అమ్మాయి కన్నా అదే విధంగా రకరకాల షేడ్స్ కలిగిన పాత్రలో చేస్తూ టైటిల్ కి సరైన జస్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకి ఇచ్చిన పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి భారీ హిట్ అందుకుంది.

సరికొత్త మేక్ఓవర్ టాటూ తో ఎన్టీఆర్… సినిమాల్లో కనిపించడం అప్పటికే వరుస విజయాల మీద ఉండటంతో ఊసరవెల్లి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సునామీని సృష్టించే కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ అదరగొట్టేసింది. ఇదిలా ఉంటేదులో తమన్నా పక్కన మరో హీరోయిన్ కనిపిస్తుంది. తమన్నాకే స్నేహితురాలిగా నటించిన ఈమె హీరోయిన్ తో సమానంగా తన పాత్రలో నటించింది.

ఈమె పేరు పాయల్ హోష్. పాయల్ పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తాలో 1992 లో జన్మించింది. పొలిటికల్ సైన్స్ లో పట్టా పొందిన ఆమె ఆ తరువాత జీవితం కోసం ముంబైకి మకాం మార్చింది.అయితే అంతకుముందే 17 సంవత్సరాల వయసులోనే బీబీసీ వారు నిర్మించిన ‘షార్పేస్ పెరిల్’ టెలీ ఫిల్మ్ లో నటించింది. అప్పటి నుంచి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఏర్పడింది.

ఇది చదవండి: చరిత్ర లో నిలిచిపోయే స్పీచ్ ఇచ్చిన యూట్యూబర్ హర్ష సాయి..!

అయితే చదువు పూర్తయిన తరువాత సినిమాల్లోకి వెళ్లాలని తల్లిదండ్రులకు చెబితే అడ్డుకున్నారు. దీంతో వారిని వ్యతిరేకించి మరీ ముంబైకి వచ్చింది. ఈ క్రమంలో ఆమె తెలుగు డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటికి పరిచయం అయింది. ఆయన తీసిన ‘ప్రయాణం’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా యావరేజ్ హిట్ కొట్టినా పాయల్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ ‘ఊసరవెళ్లి’లో సైడ్ హీరోయిన్ గా చేసింది.

Leave a Reply