Allu Arjun Vs Ram Charan | చరణ్ Vs బన్నీ. ఇద్దరి మధ్య గొడవకు అసలు కారణం ఇదే!

Ram Charan | ప్రస్తుతం అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లుగా వెలుగొందుతున్నారు. అల్లు అర్జున్ తన కెరీర్‌ను 2003లో ప్రారంభించగా, రామ్ చరణ్ 2007లో చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అంతా మెగా ఫ్యాన్స్ అయినప్పటికీ మెగా హీరోలలో ఎవరికి వారే ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ తాను మెగా కాంపౌండ్ నుంచి బయటపడి, సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.

దీనిని కొందరు తప్పుగా చిత్రీకరిస్తూ, వారి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ చిత్ర బృందానికి అల్లు అర్జున్ ఒక రోజు లేట్ గా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపాడు. దీనిపై చరణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఒకరోజు లేట్ గా విషయం తెలిసిందా అంటూ కామెంట్లు పెట్టారు.

ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో విషెష్ చెప్పలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ కు అల్లు అర్జున్ నేరుగా ఫోన్ చేసి విషెష్ చెప్పాడని తెలుస్తోంది.తాజాగా పుష్ప సినిమాకి బన్నీకి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. బన్నీకి చాలామంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపిన తీరు బన్నీ రిప్లై ఇచ్చిన తీరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

జాతీయ అవార్డుపై రామ్ చరణ్ ట్వీట్ వేశారు. అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ కి, బుచ్చిబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కి దేవిశ్రీప్రసాద్ కి కలిపి కంగ్రాట్స్ చెప్పారు. అంతేకానీ తనకి బావ అయినా అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పలేదు. గుంపులో గోవిందం లాగా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు బన్నీ కూడా సింపుల్గా థాంక్యూ అని ఊరుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా పుష్ప సినిమా తో అల్లు అర్జున్ కెరియర్ మరో మరుపు తిరిగింది అని చెప్పాలి.

Leave a Reply