Anasuya Bharadwaj | అప్పుడే భర్తను వదిలేయడానికి సిద్దం అయిన అనసూయ..

Anasuya Bharadwaj | యాంకర్ గా బాగా పాపులారిటీ తెచ్చేసుకొని ప్రస్తుతం నటిగా బిజీ అయిపోయింది అనసూయ. త్వరలో పుష్ప 2 సినిమాతో అనసూయ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక మరో వైపు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. అప్పుడప్పుడు తాను పోస్ట్ చేసే కామెంట్స్ తో వైరల్ కూడా అవుతూ ఉంటుంది. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజకీయాలపై అక్కడి రిపోర్టులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం ఇచ్చానని అనసూయ తెలిపింది.

తాను ఏ పార్టీలో చేరడం లేదంటూ అనసూయ క్లారిటీ ఇచ్చారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అనసూయ ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనసూయ సమాధానం ఇచ్చారు. అభిమాని మీరు ఒంటరిగా ఓ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా అని అనసూయను ప్రశ్నించాడు.దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. నిజానికి సింగిల్‌గా బయటకు వెళ్లాలంటే ఒకప్పుడు పిచ్చ భయమేసేది.

కానీ ఇప్పుడు ఆలోచిస్తా అంటూ సోలో ట్రిప్‌ కోసం ఏదైనా ఐడియా ఇవ్వమని ఆ అభిమానిని కోరింది. అయితే మీరు ఎక్కడున్నా పండుగే అని మరో ఫ్యాన్ అనగా.. సో స్వీట్ ఆఫ్ యూ అని మురిసిపోయింది.అనసూయ సింగిల్‌గా ట్రిప్‌కు వెళ్తానని చెప్పడంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. భర్తను వదిలేసి ఒంటరిగానే ట్రిప్స్‌కు వెళ్లేందుకు రెడీ అయిపోయావా అంటూ నెటిజన్స్ అనసూయను ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి. అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప-2 సినిమాలో విలన్ పాత్రలో నటిస్తోంది.

Recent Posts

Leave a Reply