AP Next CM | 2024లో ఏపీ సీఎం ఆయనే..తేల్చేసిన సర్వే…!

AP Political Survey For 2024 Elections

Surve | గత ఎన్నికల్లో (CM Jagan)జగన్ దెబ్బకు..బడా బడా నేతలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. టీడీపీలో పెద్ద నేతలు ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. జనమంతా జగన్ వైపుకు రావడంతో అనూహ్యంగా టి‌డి‌పి ఓటమి పాలైంది. ఇక కీలక నేతలంతా ఓటమి బాటపట్టారు. అటు janasena జనసేనలో కూడా కొందరు కీలక నేతలు ఓడిపోయారు. ముఖ్యంగా జగన్ దెబ్బకు..ఇటు లోకేష్, అటు పవన్ ఓటమి పాలయ్యారు.

వీరి ఓటమిని ఎవరు ఊహించలేదు. ఈ ఇద్దరు గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ జగన్ గాలిలో వారు ఓటమి పాలయ్యారు. లోకేష్ ఏమో మంగళగిరి బరిలో ఓడిపోతే..పవన్ భీమవరం, గాజువాక స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి ఇద్దరు నేతలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే లోకేష్..మళ్ళీ మంగళగిరి స్థానంలో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. అక్కడే పనిచేస్తూ వచ్చారు.

ప్రజలకు అండగా నిలబడ్డారు. అక్కడ ప్రజా మద్ధతు పెంచుకునే విధంగా పనిచేశారు. దీంతో అక్కడ లోకేష్ బలం పెరిగిందనే సర్వేలు వచ్చాయి.తాజాగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉంది. ఇలాంటి సమయాల్లో సర్వేలు చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. గతంలో వచ్చిన చాలా సర్వేలలో వైసీపీదే విజయమని చెప్పారు. తాజాగా మరో సర్వేలో కూడా వైసీపీ వైపే ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ పోల్‌ సర్వే సంస్థ అయిన పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలు వైసీపీకి మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి 56 శాతం ఓట్లు లభిస్తాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు 35 శాతం ఓట్లు లభించనున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి 9 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని సర్వే లో తేలింది.

Leave a Reply