Archana | అమ్మాయిలను ట్రాప్ చెయ్యాలి అంటే ఆ హీరో తరువాతే అర్చన షాకింగ్ కామెంట్స్?

allroudadda.

Archana | సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించాలి అంటే వరుసగా అవకాశాలు అందుకోవాలీ అంటే అందం అభినయం మాత్రమే కాదు అంతకుమించి అదృష్టం కూడా కలిసి రావాలి. ఇలాంటి అదృష్టం లేకే ఎంతోమంది అందమైన హీరోయిన్లు ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితమై ఆ తర్వాత కనుమరుగైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వారిలో వేద అలియాస్ అర్చన కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో చేసిన ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ బిగ్ బాస్ షో ద్వారా మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతగానో గుర్తింపును సంపాదించుకుంది.

అయితే గతంలో ఇక హీరోయిన్గా చేస్తున్న సమయంలో పలువురు హీరోలతో మితిమీరిన రొమాంటిక్ సీన్లలో కూడా అర్చన నటించింది అంటూ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే. తాజాగా అర్చన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.కొంతమంది హీరోల గురించి మాట్లాడుతూ అర్చన ఈ విషయాలను చెప్పుకొచ్చారు.రాధా గోపాళం మూవీలో ఛాన్స్ మిస్సైందని ఒక సినిమాలో క్యారెక్టర్ రోల్ చేయడం వల్ల నాకు హీరోయిన్ ఛాన్స్ పోయిందని అర్చన తెలిపారు.

ఆ తర్వాత ఇండస్ట్రీ అంటే ఏంటో నాకు అర్థం అయిందని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సినిమాలో నటించి ఉంటే నా గ్రాఫ్ అద్భుతంగా ఉండేదని అర్చన పేర్కొన్నారు.కొంతమంది క్యారెక్టర్స్ చేసి హీరోగా సక్సెస్ అయ్యారని నేను అలా కాలేదని ఆమె తెలిపారు.తెలుగు వాళ్లు నేను ఎక్కడికి వెళ్లినా నాకు ఇంకా ఆఫర్లు రావాలని చెబుతున్నారని అర్చన అన్నారు.యమదొంగలో ఛాన్స్ అంటే అది మంచి ప్రాజెక్ట్ అని ఆమె పేర్కొన్నారు.యమదొంగ మూవీ ప్లస్ అని అర్చన కామెంట్లు చేశారు.

Aamani | హీరోయిన్ ఆమని చివరి కోరిక తెలిస్తే షాక్…

ప్రస్తుతం వెరైటీ రోల్స్ వస్తున్నాయని అర్చన అన్నారు.రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర నాకు నచ్చిందని ఆమె తెలిపారు.ఒక అమ్మాయి వీక్ గా ఉంటే ఆ అమ్మాయి మైండ్ క్యాప్చర్ చేయడానికి చాలామంది ఉంటారని అర్చన అన్నారు.ఒక హీరో నాకు తెలీకుండా నా గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.ఒక హీరోది వంకరబుద్ది అని అర్చన తెలిపారు.ఎవరి సపోర్ట్ లేని అందంగా ఉన్న అమ్మాయిలను కొంతమంది హీరోలు ట్రాప్ చేస్తారని అర్చన వెల్లడించారు.మనకు ఏది గుడ్ అనేది ఏది బ్యాడ్ అనేది మనకే తెలుస్తుందని అర్చన పేర్కొన్నారు.నాకు తల్లీదండ్రుల సపోర్ట్ ఉందని అర్చన తెలిపారు.అర్చన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Posts

Leave a Reply