Bandaru satya narayana | రోజా రహస్యాలు అన్నీ నాదగ్గర ఉన్నాయి అందుకే ఇంత భయం..

bandaru satya narayana

Bandaru satya narayana | మాజీ మంత్రి టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి నోరు జారారు. అది కూడా చాలా దారుణంగా. బూతులతో లంకించుకున్నారు. ఆయన మాటలు ఆయన ఆవేశం అన్నీ కూడా నాడు మీడియా ముందు ప్రదర్శించారు. సీన్ కట్ చేస్తే అరెస్ట్ అయి బెయిల్ తెచ్చుకున్నారు. ఇక ఈ కధ ఇంతే అనుకున్నారు.కానీ ఫైర్ బ్రాండ్ రోజా అయితే అసలు ఊరుకోను అంటున్నారు.

బండారు బండారం ఇక్కడ కాదు సుప్రీం కోర్టు దాకా లాగి పూర్తి న్యాయం దక్కేవరకూ పోరాడుతాను అని ఆమె దాదాపుగా శపధమే చేస్తున్నారు. బండారు ఒక్కరే కాదు ఇక మీదట ఏ నాయకుడు కూడా మహిళల మీద మాట్లాడాలీ అంటే భయం పుట్టేలా చట్టాలు ఉండాలని ఆమె అన్నారు.ఇకపై ఎవరైనా మహిళల పట్ల చులకనగా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తానన్నారు.

బండారు సత్యనారాయణలాంటి చీడపురుగులను ఏరివేసేలా చట్టాలు తీసుకువచ్చేందుకు పోరాడుతానని స్పష్టం చేశారు. అతడిపై పరువు నష్టం దావా వేసి కోర్టుకీడుస్తానని.. సుప్రీంకోర్టు వరకైనా న్యాయ పోరాటం చేస్తానని రోజా తెలిపారు. ఈ నేప‌థ్యంలో బండారు మరోసారి ఫైర్ అయ్యారు.. అయితే నీ గురించి నిజాలు చెప్తే ఇంత బాధ పడ్డావే గతం లో పవన్ భార్యపై నువ్వు చేసిన కామెంట్స్ గురించి ఎవరు చెప్తారు అంటూ మ‌ళ్లీ రెచ్చిపోయిన బండారు.

Leave a Reply