Bigg Boss 7: బయకివచ్చిన ఫైనల్ లిస్ట్.. బిగ్ బాస్ 7 కంటేస్టెంట్స్ వీళ్లే..?

బిగ్‌ బాస్ తెలుగు ఏడవ సీజన్ కి( Bigg Boss 7 Telugu ) సమయం సమీపిస్తుంది .తొలి సీజన్ ని ఎన్టీఆర్ సూపర్ హిట్ చేసాడు.ఆ తర్వాత నాని ఆ రేంజ్‌లో మెప్పించలేకపోయినా.తనదైన శైలిలో మెప్పించాడు.

సీజన్ 3 నుంచి 6 వరకు వరుసగా నాగార్జున ( Nagarjuna ) హోస్ట్‌గా వ్యవహరించారు.అయితే సీజన్ 6 మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.తాజాగా బిగ్‌బాస్ 7వ సీజన్ పై బిగ్‌ అప్డేట్ బయటకు వచ్చింది .సీజన్ 7ను సరికొత్తగా ప్లాన్‌ చేస్తూ డిజైన్ చేస్తున్నట్టు సమాచారం .ముఖ్యంగా బిగ్‌బాస్‌కు లీకులు అనేది పెద్ద డిజాప్పాయింట్ అనే చెప్పాలి.ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు.

ఈ వారం కెప్టెన్ ఎవరు.హౌస్‌లో ఎలాంటి టాస్క్‌లు ఇవ్వబోతున్నారు.ఎవరు మొదటి తమ టాస్క్ కంప్లీట్ చేసారనేది ముందుగా సోషల్ మీడియాలో లీకులు కావడం అనేది చూసే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోయేలా చేస్తోంది ఇక బిగ్‌బాస్ సీజన్ 1 హౌస్ సెట్‌ను పూణెలో వేసారు.అక్కడ పనిచేసే వాళ్లలో ఎవరు తెలుగు వారు లేకపోవడం వల్ల లీకులు కాలేదు.

కానీ సీజన్ 2 నుంచి అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్‌బాస్ నడుస్తోంది.ఇక్కడ పనిచేసే వాళ్లంత లోకల్ కావడం వల్ల లీకులు ( Bigg Boss Leaks ) ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయి.గత కొన్ని సీజన్లు ఊరూపేరు లేనివారితో చాలా రొటీన్‌గా, జండుబామ్ షోలుగా మారడంతో నిర్వాహకులు ఈసారి మసాలా దట్టించే అవకాశాలు కనిపిస్తునాయి. గ్లామర్ బొమ్మల మంత్రం పనిచయకపోడంతో పక్కా మాస్, పక్కా కామెడీ పీసులను రంగంలోకి దించనున్నట్లు టాక్.

బిగ్ బాస్ 7 కంటేస్టెంట్స్ వీళ్లే

కార్తీకదీపం శోభాశెట్టి, ఈటీవీ ప్రభాకర్, బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ మోహన భోగరాజు, ఢీ పండు, సిద్దార్ధ వర్మ, అమర్‌దీప్ చౌదరి వంటి వారి పేర్లను పరిశీలిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియాలో రచ్చ చేసేవాళ్లు కాకుండా జనానికి కాస్తా బాగా తెలిసిన వాళ్లను టీవీ, సినీనటులను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అయితే మళ్లీ నాగార్జునే హోస్టింగ్ చేయడంతో నీలినీడలు కమ్ముకున్నాయి.అలాగే రాణా పేరు కూడా వినిపిస్తుంది చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.

Leave a Reply