Anchor: ప్రముఖ లేడీ యాంకర్ హఠాన్మరణం..!కారణం ఇదే,

ప్రముఖ యాంకర్ శివాని సేన్ Shivani Sen హైదరాబాద్ లో హఠాన్మరణం చెందారు. గత కొంతకాంగా ఆమె ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్య తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె అర్దాంతరంగా కన్ను మూశారు. శివాని సేన్ కెరీర్ లో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ కి లైవ్ యాంకర్ గా వ్యవహరించారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమె ఓ కార్యక్రమానికి హూస్ట్ గా వ్యవహరించారు.

2005లో Anchor శివాని సేన్ తొలిసారిగా ఓ ఈవెంట్ కి యాంకర్ గా వ్యవహరించారు. ఈ తర్వాత దేశంలో ఎన్నో ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్స కి ఆమె హూస్ట్ గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. టీ-హబ్‌, ఈ-కార్ రేసింగ్, హైదరాబాద్ ఈ మోటర్ షో..

ఇలా ఎన్నో ఈవెంట్స్ కి ఆమె Anchor హోస్ట్ చేసింది.ఆదివారం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న Shivani Sen శివానీ సేన్.. ఓ వీడియోని రీట్వీట్ చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అంటే సోమవారం..

ఈమెకు ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత సమస్య వచ్చింది. దీంతో ప్రాణాలు విడిచింది. ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్స్ లు, గవర్నమెంట్ ఈవెంట్స్, మీడియా లాంచ్‌లు, కోటీశ్వరుల కుటుంబాల్లోని పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలు.. ఇలా కార్యక్రమం ఏదైనా తన యాంకరింగ్ తో అదరగొట్టేసేది. ఇప్పుడు ఇలా ఆమె సడన్ గా చనిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.

Leave a Reply