Heart Attacks | చిన్న వయసులో గుండె సమస్యలు.. అసలు కారణం ఏమిటి అంటే..?

Heart Attacks | మారుతున్న కాలంతోపాటు మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన జీవితాల్ని సుఖమయం చేయడానికి అందుబాటులోకి వస్తున్న ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత ప్రత్యక్షంగాను, పరోక్షంగాను గుండెకు గునపపు పోట్లు పొడుస్తున్నాయి.

ఒకప్పుడు 60-70 ఏండ్లు నిండిన వారిలోనే కనిపించిన గుండె సమస్యలు నేడు పాతికేండ్ల యువతలో కూడా బయటపడుతున్నాయి. వయసు పైబడిన వారిలో హృద్రోగ సమస్యలకు ప్రత్యేకమైన కారణాలంటూ ఉంటాయి. కానీ చిన్న వయసులో ఇబ్బందిపెట్టే హృద్రోగాలకు మానవ తప్పిదాలే మూలమని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. వీలైనంత త్వరగా ఆ జాడ్యాలను వదిలించుకోవాలని సూచిస్తున్నారు.

మానసిక ఒత్తిడి

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏవైనా ఇబ్బందులు వస్తే కుటుంబ సభ్యులంతా కలిసి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసేవారు. అనుభవ సంపన్నులైన పెద్దలు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఎవరికివారు ఉన్నదానితో సంతృప్తి పడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. న్యూక్లియర్‌ ఫ్యామిలీస్‌ పెరిగిపోతున్నాయి. ఏదైనా సమస్య వచ్చిపడితే చెప్పుకొని బాధపడటానికి, ఏదైనా పరిష్కారం అడగటానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. కెరీర్‌లో పోటీతత్వం అధికమైంది. ఫిట్‌ ఆర్‌ క్విట్‌.. రెండే మార్గాలు. మనుగడ కోసం పోరాడాల్సిందే. ఒత్తిడిని భరించాల్సిందే. ఆ ప్రభావం చదువుల మీదా పడుతున్నది. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే అపసవ్య ధోరణి ఆరంభం అవుతున్నది.

1.కండరాలు

ఇవి పంపులా పనిచేస్తాయి. శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే శక్తిమంతమైన గూడ్సు బండిలా కూడా వ్యవహరిస్తాయి. ఈ కండరాలు బలహీనమైనప్పుడు గుండె విఫలం అవుతుంది.

2.కవాటాలు

గుండె గదిలో నాలుగు కవాటాలు ఉంటాయి. ఇవి తెరుచుకోవడం, మూసుకోవడం ద్వారా హృదయ స్పందన జరుగుతుంది. రక్తం ఒకే దిశలో ప్రవహించేందుకు ఈ కవాటాలు దోహదపడతాయి. తెరుచుకోవడం, మూసుకోవడం అనే ప్రక్రియ సరిగ్గా జరగకపోతే గుండె పనితీరుకు అవరోధం ఏర్పడుతుంది. ఎకో కార్డియోగ్రామ్‌(2డి-ఎకో), ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా గుండె కవాటాల పనితీరు, గుండె పంపింగ్‌ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు.

3.ఆహారపు అలవాట్లు

Leave a Reply