Chandrababu | జైలులో చంద్రబాబుకు పెట్టె టిఫిన్, భోజనం ఇదే..!

Chandrababu | స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం, రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. బాలకృష్ణ, నారా లోకేష్ తో పాటు పలువురు ఖండించారు. INDIA కూటమిలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు సైతం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అన్నారు.

అయితే టాలీవుడ్ నుండి ఎలాంటి స్పందన లేదు. చంద్రబాబు నాయుడు అరెస్టై 5 రోజులు గడుస్తున్నా ఒక్క హీరో, దర్శక నిర్మాత, ఇతర ప్రముఖులు వ్యతిరేకించలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ మౌనం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడు. ఎప్పటికైనా టీడీపీ పార్టీకి ప్రాతినిధ్యం లేదా కీలక పాత్ర వహించాల్సిన వాడు. అలాంటి ఎన్టీఆర్ టీడీపీ అధినేత అరెస్ట్ పై మాట్లాడకపోవడంతో పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అది పక్కన పెడితే మండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు తొలిరోజు భోజనంపై అప్డేట్ బయటకు వచ్చింది. ఈయన మాజీ సీఎం కావడం.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కావడంతో ఒక గది, ఇంటి భోజనం అనుమతి కోరగా.. కోర్టు ఓకే చెప్పింది. దీంతో చంద్రబాబుకు ఉదయం టిఫిన్ పంపించారు. ఈ మధ్యాహ్నం భోజనం కూడా ఇంటినుంచే వెళ్లింది.ఈ ఉదయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ తీసుకెళ్లిన సిబ్బంది.. ఈ మధ్యాహ్నం చంద్రబాబుకు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో అది కూడా కుటుంబ సభ్యులు వండడంతో తీసుకెళ్లారు.

ఇది చదవండి: మళ్ళీ తల్లి కాబోతున్న యాంకర్ అనసూయ..?

అల్పాహారం తర్వాత తాగేందుకు వేడినీళ్లు, బ్లాక్ కాఫీ తీసుకెళ్లారు.ఇక మధ్యాహ్నం భోజనంలోకి బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీరు కూర, పెరుగు ను ఇంటి నుంచి తయారు చేసి చంద్రబాబు కోసం పంపించారు..మధ్యాహ్నం మూడు గంటలకు టీ తాగేందుకు వేడి నీళ్లు పంపిన కుటుంబ సభ్యులు దాన్ని మధ్యాహ్న భోజనంతోనే పంపారు. రాజమండ్రి రూరల్ సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటి నుంచి చంద్రబాబుకు భోజనం పంపించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడంతో టీడీపీ ఎమ్మెల్యే ఇంటి నుంచే చంద్రబాబు కు సప్లై చేస్తున్నారు.

Leave a Reply