constable | ఇన్‌స్టాలో రీల్స్ చెయ్యడంతో కానిస్టేబుల్ ఉద్యోగం ఊస్ట్..

constable | ప్రస్తుతం సోషల్ మీడియాను ఎలా వినియోగించుకుంటున్నారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా యువతీ యువకులు సోషల్ మీడియా కి బానిసలైపోయారు. రీల్స్, షాట్స్ అంటూ ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా పాపులర్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాజాగా ఓ యువతి రీల్స్ చేయడం వలన తన పోలీసు ఉద్యోగాన్ని పోగొట్టుకుంది.కాస్‌గంజ్ జిల్లాకు చెందిన ఆర్తీ సోలంకీ అనే కానిస్టేబుల్‌ నేటితరం యువతకు అసలైన నిర్వచనం.

ఆమెకు ఇన్‌స్టాలో రీల్స్ చేయడం ఎప్పటినుంచో అలవాటు. నిత్యం ఏదోక వీడియోను జనాలతో పంచుకుంటూ ఉంటుంది. అయితే, ఈ యావ ఎక్కువైపోవడంతో ఇటీవల ఓ రోజు ఆమె ఏకంగా పోలీసు యూనీఫాం ధరించి వీడియో రికార్డు చేసింది. అమితాబ్ బచ్చన్, శతృఘ్ణ సిన్హా నటించిన 1980ల నాటి ఓ సినిమాలోని ఓ పాటకు లింప్ సింక్ చేస్తూ వీడియో చేసుకుంది. ఆ తరువాత దాన్ని నెట్టింట పంచుకుంది.

ఓ పోలీసు ఇలాంటి వీడియో చేస్తే జనాలు ఊరుకోరు కదా! అందుకే వీడియోను విపరీతంగా వైరల్ చేశారు. బోలెడన్ని కామెంట్స్, లైక్స్‌తో రచ్చరచ్చ చేశారు.ఇదే చివరకు ఆర్తీ ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. ఆమె వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆర్తీని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, డిపార్ట్‌మెంటల్‌ ఎంక్వైరీ కూడా ప్రారంభించారు. దీంతో, ఆర్తీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆమె ఉదంతం అక్కడి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా హాట్‌టాపిక్‌గా మారింది.

Leave a Reply