Gold Rates: పడిపోయిన బంగారం, వెండి ధరలు..!నేడు ఎంత అంటే..?

Gold Price Today | బంగారం కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే బంగారం ధరలు దిగి వచ్చాయి. దేశంలో పసిడి రేటు నేడు పడిపోయింది. వెండి రేటు కూడా గోల్డ్ ధరల బాటలోనే పయనించింది. బంగారం ధరలు గత కొంత కాలంగా డౌన్ ట్రెండ్‌లోనే ఉంటూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కారణంగా బంగారం ధరలు దేశీ మార్కెట్‌లో పడిపోతూ వస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

అందువల్ల బంగారం కొనాలని భావించే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమం.దేశంలో మాదిరిగానే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా బంగారం ధరలు వెలవెలబోతున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గమనిస్తే.. బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. పసిడి ప్రేమికులకు ఇది బంగారం లాంటి అంశం అని చెప్పుకోవచ్చు.హైదరాబాద్‌ మార్కెట్‌లో చూస్తే..బంగారం ధరలు ఈరోజు తగ్గాయి.

జూలై 3న బంగారం ధరలు క్షీణించాయి. 24 క్యారెట్ల బంగారం ధర Gold Price రూ. 110 మేర పడిపోయింది. దీంతో ఈ గోల్డ్ రేటు పది గ్రాములకు రూ. 59,070 నుంచి రూ. 58,960కు తగ్గింది.అలాగే 22 క్యారెట్ల బంగారాన్ని గమనిస్తే.. ఈ పసిడి రేటు రేటు కూడా తగ్గింది. ఈ బంగారం ధర రూ. 100 క్షీణించింది. దీంతో ఈ ఆర్నమెంటల్ గోల్డ్ రేటు రూ. 54,150 నుంచి రూ. 54,050కు దిగి వచ్చింది.కాగా బంగారం ధరలు తగ్గడం ఈ నెలలో ఇదే తొలిసారి.

జూలై నెల ఆరంభం నుంచి చూస్తే.. బంగారం ధరలు Gold Price ఈ రోజే తగ్గాయి. నిన్న, మొన్న బంగారం ధరలు తగ్గలేదు. జూలై 1న బంగారం ధర పెరిగింది. జూలై 2న పసిడి రేటు స్థిరంగా ఉంది.ఇక వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు కూడా ఈరోజు పడిపోయింది. వెండి ధర రూ. 200 మేర దిగి వచ్చింది. సిల్వర్ రేటు ఈ రోజు రూ. 75,700 నుంచి రూ. 75,500కు క్షీణించింది. వెండి రేటు కూడా ఈ నెలలో తగ్గడం ఇదే తొలిసారి.

Leave a Reply