హనుమంతుడు, లక్ష్మీదేవి, శివుడు ,శనికి కేవలం ఈ పూలతో పూజా చేస్తే మీకు తిరుగుండదు..!

పూజ సమయంలో ఏ దేవుడికి ఏ పూలు పెట్టాలో తెలుసా… శనికి, హనుమంతుడికి, లక్ష్మీదేవికి, శివుడికి కొన్ని సమర్పించాల్సిన పువ్వులు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఆ పువ్వులతో పూజ చేసినట్లయితే మీ కోరికలు కూడా తీరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

1) హనుమంతుడికి మందార పువ్వు, బంతి పువ్వు చెడు వికర్షణకుడిగా భావిస్తారు. మీరు కూడా హనుమాన్ భక్తులు అయితే పూజ సమయంలో బంతి పువ్వులు, మందార పువ్వులను పూజలో పెట్టవచ్చు. ఈ పువ్వులను అనుమంతునికి పెట్టడం వలన ఆయన భక్తుల కోరికలను నెరవేరుస్తాడు.

2) శివుని కోసం గంట పువ్వు… గంట పుష్పం కేవలం శివునికి మాత్రమే కాదు.. దేవుళ్ళు అందరికీ ప్రీతికరమైనవి.. దైవిక దృక్కోణం నుంచి ఇది శివునికి అత్యంత ఇష్టమైన పువ్వుగా అంటుంటారు. శివున్ని పూజలో ఈ పుష్పం సమర్పించడం వలన కోరుకున్న సంపదలను లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. శివున్ని పూజించేటప్పుడు ఈ పువ్వుని పెట్టడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి. అని నమ్ముతుంటారు.

3) లక్ష్మీదేవి పూజలో తామర పువ్వు… లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన ఇంట్లో పేదరికం ఏనాటికి కలగదు. లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ప్రీతికరం మీ ఇష్టానుసారం లక్ష్మీదేవికి ఏ పుష్పమైన సమర్పించవచ్చు అని తెలియజేస్తూ ఉంటారు. కానీ మీరు లక్ష్మీదేవికి సమర్పించే పువ్వులు ఎప్పుడు చెడిపోకూడదు… పొడిబారకుండా ఉండాలని గుర్తుపెట్టుకోండి..

4) శని దేవుడు శమీ పువ్వులతో ప్రసన్నుడు అవుతాడు. శని దేవుని అనుగ్రహం పొందిన వ్యక్తి తన గృహంలో ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. శనిదేవునికి శమీ పువ్వులు చాలా ఇష్టమైనవి. శని దేవుని పూజించేటప్పుడు శమీ పుష్పాలను లేదా శనికి ఇష్టమైన నీలిరంగి పువ్వులను సమర్పించడం శ్రేయస్కరం. కావున మీరు శని దేవునికి పూజించేటప్పుడు ఉపయోగించండి.

Leave a Reply