Lapsed LIC | మీ ఎల్ఐసి పాలసీ ల్యాప్స్ అయిందా? అయితే మీకు పండగే..

LIC Policy: భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ చాలా రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీను రూపొందిస్తుంటుంది. వినియోగదారులు ఎంచుకునే ఎల్ఐసీ పాలసీ ఆధారంగానే వచ్చే బెనిఫిట్స్ సైతం ఉంటాయి. అందుకే పాలసీ ఎంచుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.అది పక్కన పెడితే కస్టమర్లు తమ పాలసీలను తిరిగి ఓపెన్ చేసుకోవడానికి ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 21 వరకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నారు.

ఇక ఈ సదవకాశాన్ని ఎల్ఐసి ఖాతాదారులు వినియోగించుకోవాలని ఎల్ఐసి స్పష్టం చేసింది. సాధారణంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలసీలు ల్యాప్స్ అవ్వవు. కానీ ఆర్థిక కారణాలవల్ల లేదా ఇతర ఏదైనా కారణాలవల్ల ప్రీమియం చెల్లించకపోవడంతో ఇలా ల్యాప్స్ అవుతూ ఉంటాయి.ఇక పాలసీలు ల్యాప్ అయిన వారి ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు తాము ఈ అవకాశాన్ని కల్పించామని ఎల్ఐసి కూడా తెలిపింది.

ఇకపోతే జీవిత బీమా అనేది రిస్క్ మేనేజ్మెంట్ అని ఊహించని ప్రాణ నష్టం జరిగినప్పుడు పాలసీదారులు కుటుంబ సభ్యులకు భీమా భరోసా కల్పించవచ్చు అని వివరించింది. ఇక ఎల్ఐసి తీసుకొస్తున్న ఈ ఆఫర్ ద్వారా అన్ని యులిప్ – యేతర పాలసీలను ఐదు సంవత్సరాలలోపు లేట్ ఫీజు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు అని ఎల్ఐసి పాలసీదారులకు ఎల్ఐసి తెలిపింది.

ఇక ఎల్ఐసి అందించిన సమాచారం ప్రకారం.. ప్రీమియం రూ.1 లక్ష లోపు ఉంటే ఆలస్య రుసుములో 25% డిస్కౌంట్ పొందవచ్చు. గరిష్టంగా రూ.2500 రాయితీ కూడా లభిస్తుంది. ఇక మూడు లక్షల కంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా రూ.3, 500 రాయితీతో 30% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలను 100 శాతం ఆలస్యంతో పునరుద్ధరించుకోవచ్చు. ఇక చూశారు కదా ఎల్ఐసి అందిస్తున్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవిత బీమా పాలసీని మళ్లీ మీరు మొదలు పెట్టవచ్చు.

Leave a Reply