Marriage : వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి డేట్ ఫిక్స..! ఎప్పుడో తెలుసా..

Lavanya Tripathi , Vaishnav Tej

మెగా అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూసిన వరుణ్ తేజ్( Varun Tej ) మరియు లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఇ మధ్యే వీళ్లిద్దరు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్ గా నిచితార్థం చేసుకున్నారు.సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసిన ఈ క్యూట్ జంటకి సంబంధించిన నిశ్చితార్ధ ఫొటోలే కనిపిస్తున్నాయి.

మెగా కుటుంబ హీరోలందరినీ ఒకే చోట చూసేలోపు ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది.ఈ నిశ్చితార్ధ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఆకర్షణగా నిలిచాడు.ఆయనకీ సంబంధించిన ఫోటోలు బయటకి రాగానే సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది.అది పక్కన పెడితే ఇప్పుడు వరుణ్-లావణ్య త్రిపాఠి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకొనేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.ఆగస్ట్ 25న వీరి పెళ్లి జరగబోతుందని స‌న్నిహితులు చెబుతున్నారు. వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందుగా అంటే ఆగస్ట్ 24న వరుణ్, లావణ్య పెళ్లి జరగనుందట.

Leave a Reply