ఎంగేజ్మెంట్ లో లావ‌ణ్య త్రిపాఠి క‌ట్టిన ఆ చీర ఖ‌రీదు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్…ల ఎంగేజ్మెంట్ హైదరాబాద్, మనికొండలో ఉన్న నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధుమిత్రుల.. సమక్షంలో ఘనంగా జరిగింది. గత 4,5 రోజులుగా సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై అనేక వార్తలు వైరల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. మొదట్లో వీళ్ళు డేటింగ్ లో ఉన్నట్టు ఎన్నో వార్తలు వచ్చేవి. కానీ అవి అవాస్తవాలని వీళ్ళు తేల్చి చెప్పేశారు.

కానీ ఆ ప్రచారం ఆగలేదు. కొన్నాళ్ల తర్వాత వీటికి స్పందించడం కూడా మానేశారు.అయితే ఫైనల్ గా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. జూన్ 9న లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ల ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని అఫిషియల్ గా ప్రకటించడంతో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సంబరాలు మొదలైనట్టు అయ్యాయి. ఇంకా మెగా హీరోలంద‌రూ వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ లో సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుత‌న్నాయి.

అయితే ఎంగేజ్మెంట్ వేడుక‌లో లావ‌ణ్య త్రిపాఠి క‌ట్టిన చీర ఖ‌రీదు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.లైట్ గ్రీన్ కలర్ చీర‌లో లావ‌ణ్య త్రిపాఠి(Lavanya Tripathi) అందంగా మెరిసిపోయింది. ప్ర‌ముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే లావ‌ణ్య త్రిపాఠి చీర‌ను డిజైన్ చేశారు.

( Photos : Instagram )

ఆరు గజాలు ఉండే ఈ లైమ్-గ్రీన్ బనారసి చీర ఖ‌రీదు రూ. 75,000. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు క‌ళ్లు తేలేస్తున్నారు. నిశ్చితార్థానికే ఇంత క‌రీదైన చీర కట్టింది అంటే పెళ్ళికి కచ్చితంగా లక్ష రూపాయలు దాటుతుంద‌ని మాట్లాడుతుకుంటున్నారు.

( Photos : Instagram )

Leave a Reply