Mahesh Babu | పవన్ కళ్యాణ్ 100కోట్లు తీసుకుంటే నీకు ఎందుకు నొప్పి.. మ‌హేష్ షాకింగ్ రియాక్షన్..

Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో తన కెరీర్‎లో దూసుకుపోతున్నారు . అయితే మహేష్ ఎలాంటి సినిమా చేసినా..ఎంతటి యాక్షన్ సినిమా అయినా తన లుక్ విషయంలో కొన్ని లిమిట్స్‎లోనే ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ..మహేష్ బాబు అంటే సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. ప్రిన్స్‎ది హాలీవుడ్ కట్ అవుట్ అయినా, టాలీవుడ్ పరిధిలోనే తన లుక్, ఫిజిక్ ఉండేలా చూసుకుంటాడు.

చక్కని రూపంతో పాటు ఆరడుగుల ఆజానుబాహుడు అయినా సరే, ఆయన ఎప్పుడూ సిక్స్ ప్యాక్ చేయలేదు. ఇన్నేళ్ల కెరీర్‎లో ఏనాడు చొక్కా విప్పి నటించలేదు. కానీ, ఇప్పుడు రాజమౌళి మహేష్‎తో అలాంటి పని చేయించబోతున్నాడేమో అన్న టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది.అయితే సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే రెండేళ్ల క్రితం బిగ్ సికి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు నియమితులయ్యారు.

ఇదిలా ఉంటే, ఆదివారం (ఆగస్టు 20న) బిగ్ సి 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ రెండు దశాబ్దాల ప్రయాణాన్ని మీడియా సమక్షంలో సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ‌గా, ఈ ప్రెస్ మీట్‌లో బిగ్ సి వ్యవస్థాపకుడు, సీఎండీ యం.బాలు చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నకుమార్‌తో పాటు మహేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.

ఈ క్ర‌మంలో ఓ రిపోర్ట‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంద కోట్లు తీసుకుంటున్నాడు, దానికి గురించి ఏమంటారు అని అడ‌గ‌గా, ఆయ‌న వంద కోట్లు తీసుకుంటే మీకేమి నొప్పి అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు..అలాగే ఫోన్ వాడకంలో మీ పిల్లలకు కూడా స్వేచ్ఛ ఇస్తారా ? నేను ఇవ్వడం ఏమిటి .. వాళ్ళే తీసుకున్నారు అని చెప్పారు మ‌హేష్‌. మీ ఫోన్ రింగ్ టోన్ ఏమిటి ? అని రిపోర్ట‌ర్ అడ‌గ‌గా, నాది సైలెంట్‌ టోన్ అని అన్నారు. మీరు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినపుడు మీ అనుభూతి ఎలా వుంటుంది ? అని అడ‌గ‌గా, నాకు సంబంధించిన వస్తువులన్నీ నా భార్య కొనుక్కొని తీసుకొస్తుంది.

Leave a Reply