Mohan Babu | అయోధ్యకి రమ్మని ప్రధాని పిలిచారు కానీ నేనే వెళ్లలేదు. మోహన్ బాబు

allroudadda

Mohan Babu | అయోధ్య భవ్య మందిరంలో బాల రాముడు కొలవుదీరాడు. బాలక్ రామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులకు దర్శన ప్రవేశం కల్పించిన సగంతి తెలిసిందే. కాగా మొదటి రోజు ఏకంగా 5 లక్షలకు పైగా భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు. చాలా మంది భక్తులు అయోధ్యకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య వెళ్లే భక్తులకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అలర్ట్ జారీ చేసింది.

అయోధ్య రామయ్య దర్శన వేళల్లో మార్పులు చేసింది. ఇంతక ముందు ఉదయం 7 -11.30 గంటల వరకు; మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉన్న సమయాలను మార్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్నందున ఇక నుంచి ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు దర్శనాలు చేసుకునేందుకు వీలు కల్పించారు.అది పక్కన పెడితే ఇప్పటికే రామ మందిరం ట్రస్ట్ నిర్వాహకులు పలువురు సినిమా సెలబ్రిటీలను రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను కలిసి వారికి రామ మందిర ఆహ్వానం పత్రికను అందజేసిన సంగతి మనకు తెలిసిందే.

రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం..

allroudadda
allroudadda

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా పలువురు హీరోలకు ఈ ఆహ్వానం అందింది. ఇప్పటికే రామ్ చరణ్ చిరంజీవి ప్రభాస్ పవన్ కళ్యాణ్ వంటి సినీ సెలబ్రిటీలకు ఈ ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీకి అయోధ్య నుంచి ఆహ్వానం అందలేదన్న సందేహాలు అందరికీ వ్యక్తం అయ్యాయి.

ప్రాణప్రతిష్టకు సెలెక్ట్ అవ్వని రాముని విగ్రహాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.

ఈ విషయం గురించి మోహన్ బాబు Mohan Babu | మాట్లాడుతూ తమ కుటుంబానికి కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందిందని తెలియజేశారు.రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందడమే కాకుండా తమకు సెక్యూరిటీ కూడా కల్పిస్తామని తెలియజేశారు కానీ భయం వల్లే మేము అయోధ్యకు వెళ్లడం లేదు అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply