Money Tips | రోడ్డు మీద దొరికిన డబ్బుతో ఇంట్లో ఇలా చేస్తే ఇక డబ్బే డబ్బు..!

Money Tips | సంతోషంగా జీవించాలంటే ఆరోగ్యంతో పాటూ డ‌బ్బు కూడా అవ‌స‌రమే. #Money Tipsడ‌బ్బు లేదంటే ప్ర‌స్తుతం స‌మాజంలో విలువ కూడా ఇవ్వ‌డం లేదు. అంతే కాకుండా ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుండి నిద్ర‌పోయే వ‌ర‌కూ ప్ర‌తి ప‌ని కూడా డ‌బ్బుతోనే ముడిప‌డి ఉంటుంది. అయితే డ‌బ్బు రావాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. గంటల త‌ర‌బ‌డి ప‌నిచేయాల్సి ఉంటుంది. అలాంటి డ‌బ్బు ఊరికే వ‌స్తే ఎవ‌రు కాదంటారు.

అయితే సాధారణంగా మనకు అప్పుడప్పుడు పలు భిన్న రకాలుగా డబ్బులు లభిస్తుంటాయి. ఒక్కోసారి మనం రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు కరెన్సీ నోట్లు లేదా నాణేలు మనకు కనిపిస్తుంటాయి. కొందరు ఆ డబ్బును పట్టించుకోరు. కొందరు దాన్ని తీసుకుంటారు. ఇక కొందరు డబ్బును విరాళాల రూపంలో సేకరించి ప్రార్థనా మందిరాలకు ఇస్తారు. కొందరు పేదల కోసం ఖర్చు చేస్తారు.అయితే హిందూ విశ్వాసాల ప్రకారం సంపదను లక్ష్మీదేవికి మరో రూపంగా భావిస్తారు.

అందువల్ల ఆ సంపద రోడ్డు మీద ఉన్నప్పుడు దాన్ని తీసుకోవాలి. లేదంటే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు డబ్బులు లభించినా, దొరికినా ఆ డబ్బును ఆఫీసులో లేదా పనిచేసే చోట్ల పెట్టుకోవాలి. ఆ డబ్బును ఖర్చు పెట్టరాదు.అలాగే ఇంటికి వచ్చేటప్పుడు డబ్బు లభిస్తే దాన్ని పొదుపు చేసేందుకు ఉపయోగించాలి. ఆ డబ్బును ఖర్చు చేయరాదు. ఏదైనా సంచిలో దాన్ని పొదుపు చేయాలి. అలా పొదుపు చేసి వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి.

Leave a Reply