Naresh – ఈ రోజుకైనా పిల్లల్ని కనడానికి మేము సిద్ధంగా ఉన్నాము నరేష్ పవిత్ర..!

Naresh

Naresh | నరేష్ పవిత్ర వయసుతో సంబంధం లేకుండా వీళ్ళిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వీళ్ళిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది కేవలం 15 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించామని..

ఇక తాము ఇద్దరం మంచి వాళ్ళమని.. నిజ జీవితంలో ఎదురైన చేదు ఘటనల వల్లే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని.. ఎవరు కూడా తమ బంధాన్ని తప్పుగా అనుకోవద్దని చెప్పడం కోసమే ఈ సినిమా చేసాము అంటూ నరేష్ వ్యాఖ్యానించడం గమనార్హం.

పిల్లల్ని కనడానికి మేము రెడీ..

తాజాగా మళ్ళీ పెళ్లి చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ లో నరేష్ కి పవిత్ర లోకేష్ అంటే ఎంత ఇష్టమో తెలియజేశాడు. పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా మాది బలమైన పవిత్ర బంధం అంటున్నారు. మరి అంతగా ప్రేమించే పవిత్ర లోకేష్ తో నరేష్ కి పిల్లల్ని కనే ఆలోచన ఉందా?. ఈ ప్రశ్నపై ఆయన స్వయంగా స్పందించారు. పిల్లల్ని కనడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. పవిత్ర, నేను పిల్లల్ని కనేందుకు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాము.

నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. ఇప్పుడు పిల్లలు పుడితే వాళ్లకు 20 ఏళ్ళు వచ్చే నాటికి నా వయసు 80. కాబట్టి పిల్లలు కనాల్సిన అవసరం లేదు. నా పిల్లలు, పవిత్ర లోకేష్ పిల్లలు అందరినీ మా పిల్లలుగా పరిగణిస్తాం. మొత్తంగా మాకు ఐదుగురు పిల్లలు ఉన్నారని నరేష్ ఓపెన్ అయ్యారు. పిల్లల్ని కనే ఓపిక ఉంది. అయితే ఈ వయసు కనడం సరికాదని ఆయన పరోక్షంగా చెప్పారు.

Leave a Reply