Sr NTR | ఎన్టీఆర్ ది అతనిది ఎంత బ్యాడ్ క్యారెక్టర్ అంటే..

Sr NTR

Sr NTR | ఎన్టీఆర్ తెలుగు లోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళం ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటికే అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో ఒక రాముడు, కృష్ణుడిగా నిలిచిపోయారు. అయితే ఎన్టీఆర్ సినిమాలు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదట. అయితే ఎన్టీఆర్ తెలుగు సినిమాకు చుక్కాని.. తెలుగు సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన తెలుగువారితోనే ఉన్నారు.

Sr NTR
Sr NTR

సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆంధ్రుల అభిమాన ‘అన్నగారు’గా మారారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వేదికగా చాటారు. 9 నెలల్లో కాంగ్రెస్ ను పాతరేసి తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చారు. ఎన్టీఆర్ సినీరంగ ప్రవేశం నుంచి చివరి సినిమా వరకు, రాజకీయాల్లోకి మారాక కూడా విలువలు పాటిస్తూ ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయారు.

Sr NTR
Sr NTR

ఎన్టీఆర్ లోని నటుడిని, దర్శకుడిని నిర్మాతను, కళాకారుడిని, మానవాతమూర్తిని, ప్రయోగశీలిని, వితరణశీలిని, అభ్యుదయ వాదిని, దార్శనికుడిని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. అందుకే ఆయన మనతో లేకున్నా ఆ యుగ పురుషుడిని మన స్మరించుకుంటూనే ఉంటాం.. నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయనను తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు వారు ఘనంగా స్మరించుకుంటున్నారు.

Leave a Reply