Lord Siva | శివుణ్ణి ఏ పూలతో పూజితే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసా?

Lord Siva

భగవంతుని పూజ ఎలా చేయాలో మన హిందూ సాంప్రదాయంలో కొన్ని చెప్పబడ్డాయి. ప్రధానంగా పూజలో కొబ్బరికాయ, పూలు, పండ్లు, సుగంధ పదర్థాలు, ప్రసాదాలు ఉంచుతారు. కొందరు తమ శక్తి మేరకు పండ్లు, ప్రసాదాలు పెడుతూ పూజను చేస్తారు. కానీ ప్రతీ ఒక్కరు పూజలో తప్పక ఉపయోగించేది పూలు. అయితే అసలు ఏ దేవుడి పూజలో ఏ పూలను ఉపయోగించాలి? అభిషేక ప్రియుడైన శివుడి పూజలు ఏ పూలను వాడాలి? ఆయా రకాల పూలను దేవుడికి పూజ చేస్తే ఏం ఫలితం లభిస్తుంది అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shiva
Lord Shiva

శివుణ్ణి ఏ పూలతో పూజితే

నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే … జేవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లబిస్తుంది. పారిజాత పువ్వుని దేవుడికి సమర్పిస్తే కాల సర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లబిస్తుంది. జాజి పూలు..అర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి. రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం మీదే అవుతుంది.

Lord Shiva
Lord Shiva

వకుళ పుష్పం… శ్రీ భూవరాహ స్వామికి, శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది. అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే జీవితంలో సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి.

Lord Shiva
Lord Shiva

తెల్లని జిల్లేడు పువ్వుతో గణేశునికి, శంకరునికి, సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి, ఆరోగ్య్యం కలుగుతుంది. ఇలా అయా పుష్పాలను భక్తి, శ్రద్ధలతో పూజిస్తే తప్పక చెప్పిన ఫలితాలు కలుగుతాయని ఆయా పురాణాలలో పేర్కొన్నాయి.

Leave a Reply