తండ్రి లాగే కూతురు అంటూ.. ఆద్య వీడియో పోస్ట్ చేసిన రేణు దేశాయ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న సంగతి తెలిసిందే.నిజానికి చాలా కాలం నుంచి ఫేస్బుక్ పేజ్ తో పాటు ట్విట్టర్ కూడా మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి మాత్రం ఈ మధ్యనే ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా పెట్టకపోయినా రికార్డ్ స్థాయిలో ఆయన అకౌంటును చాలా మంది ఫాలో అయ్యారు. అది క్రియేట్ చేసిన రోజుల వ్యవధిలోనే 2 మిలియన్ అంటే ఇరవై లక్షల మంది ఆ అకౌంటును ఫాలో అవుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ వీడియోలో తన మాజీ భార్య రేణు దేశాయ్ ఫోటో కూడా ఆయన షేర్ చేశాడు. ఆ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలని సినీ పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు తాను కృతజ్ఞుడిని అని చెబుతూ దాదాపుగా రెండు నిమిషాల 35 సెకండ్ల నిడివి గల వీడియోని ఆయన షేర్ చేసుకున్నారు.

అయితే ఆమధ్య ఇప్పటం గ్రామానికి వెళ్ళినప్పుడు కారు పైన కూర్చొని వెళ్లారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ స్టైల్, యాటిట్యూడ్ ఈ వీడియోలో సూపర్ గా ఉండటంతో ఇది అభిమానులని మరింత ఆకర్షించింది. పవన్ అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేశారు.

తాజాగా పవన్ కూతురు ఆద్య కూడా కారు టాప్ ఓపెన్ చేసి పైకి నించుంది. కారులో వెళ్తుండగా ఆద్య ఇలా నిల్చోవడంతో రేణు దేశాయ్ దీన్ని వీడియో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోకి ‘నాన్న లాగే కూతురు కూడా’ అని కొటేషన్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆద్య వీడియో కూడా వైరల్ గా మారింది. ఆద్య కూడా పవన్ లాగే కారుపై నుంచి కనపడేలా నిల్చోవడంతో, రేణు దేశాయ్ ఇలా పవన్ గురించి పోస్ట్ పెట్టడంతో పవన్ అభిమానులు ఖుషి అవుతున్నారు.

Leave a Reply