Arundhati Movie | అరుంధతి పాత్ర కోసం ముందు నన్నే సంప్రదించార.. కానీ నేను చేయలేదు.. స్టార్ హీరోయిన్,

Anushka Shetty | అనుష్క కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచిన సినిమా అరుంధతి. ఈ సినిమా అనుష్కలో దాగి ఉన్న నట బీభత్సాన్ని బయటపెట్టింది. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం అనుష్క కంటే ముందు ఇద్దరు హీరోయిన్స్ కి వచ్చింది. వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు కాగా మరొకరు ప్రేమ. 2009 జనవరి 16న విడుద‌లైన ఈ చిత్రంలో బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.అరుంధ‌తి సినిమాకు ముందు కోడి రామకృష్ణ(Kodi Ramakrishna) సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.

మరోవైపు నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కూడా డౌన్ ఫాల్ లో ఉన్నారు అలాంటి త‌రుణంలో భారీ విజువల్ వండర్‌కు శ్రీకారం చుట్టారు. పెద్ద‌గా హ‌డావుడి లేకుండా సైలెంట్‌గా అరుంధతిని ప్రారంభించారు.ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలయ్యే వరకు కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. అప్ప‌ట్లోనే రూ.35 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా.

అలాగే అప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ కే ప‌రిమిత‌మైన అనుష్క శెట్టి(Anushka Shetty).. ఈ చిత్రంలో అరుంధతి పాత్ర‌లో త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది.అయితే అరుంధతి సినిమాకు ఫ‌స్ట్ ఛాయిస్ అనుష్క కాదు. మొట్ట మొద‌ట అరుంధ‌తి సినిమా క‌థ‌ను మ‌ల‌యాళ న‌టి మ‌మ‌తా మోహ‌న్‌దాస్ కు చెప్పార‌ట‌. ఆమె కూడా ప్రాజెక్ట్ ఒప్పుకుని సైన్ చేశారట.

ఇంత‌లోనే మమతా మోహన్ దాస్ మేనేజర్ మల్లెమాల ప్రొడక్షన్(mallemala productions) హౌస్ మంచిది కాదని చెప్పారట. తెలుగు సినిమా పరిశ్రమపై పెద్ద‌గా అవగాహన లేని మమతా మేనేజర్ మాటలు గుడ్డిగా న‌మ్మి అరుంధతి నుంచి త‌ప్పుకుంది. ఆ త‌ర్వాత దాదాపు మూడు నెల‌లు నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి అరుంధతి సినిమాను చేయ‌మ‌ని మ‌మ‌తా వెండ‌బ‌డ్డార‌ట‌. అయినాస‌రే మ‌మ‌తా నో చెప్పింద‌ట‌. ఆ త‌ర్వాత గ్లామ‌ర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అనుష్క ను ఫైన‌ల్ చేశారు. క‌ట్ చేస్తే సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన త‌ర్వాత మ‌మ‌తా అరుంధతిని మిస్ చేసుకుని పెద్ద త‌ప్పు చేశాన‌ని ఎంత‌గానో బాధ‌ప‌డింద‌ట‌.

Leave a Reply