Sathyaraj | షాక్ .. బాహుబలి కట్టప్ప ఇంట తీవ్ర విషాదం..

Sathyaraj | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ చిత్రం బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ముఖ్యంగా ఈ సినిమాలో కట్టప్ప పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది. కట్టప్ప పాత్ర లేనిదే సినిమాను ముందుకు తీసుకెళ్లడం కష్టం అనేంతలా సినిమాను ఆయన ఒంటి చేత్తో నడిపించారు. అలా భారీ పాపులారిటీ దక్కించుకున్న కట్టప్ప పాత్రలో ప్రముఖ కోలీవుడ్ నటుడు సత్యరాజ్ అద్భుతంగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. సత్యరాజ్ తల్లి నతంబాల్ మృతి చెందారు. ఆమె వయస్సు 94. గత కొన్నేళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.దీంతో సత్యరాజ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లి మరణవార్త విన్నవెంటనే హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్న సత్యరాజ్ వెంటనే కోయంబత్తూర్ కు పయనమైనట్లు సమాచారం.

నతంబాల్ కు ముగ్గురు పిల్లలు. ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి సత్యరాజ్.. కుమార్తెలు కల్పన, రూప. ఇక సత్యరాజ్ కు తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమెకు తాను నటించిన సినిమాలు చూడడం ఇష్టం అని ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.ఇక సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్.. ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపాడు.

Leave a Reply