30 ఏండ్లు దాటాక పెళ్లి చేసుకుంటే ఆస‌మ‌స్య‌లొస్తాయా?

నా వయసు 29 ఏండ్లు. ప్రస్తుతం మరో రెండేండ్లలో పెండ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. నా స్నేహితులు మాత్రం 30 ఏండ్లు దాటాక పెళ్లి చేసుకుంటే సె* పరమైన సమస్యలు వస్తాయంటున్నారు. నిజమేనా?పెళ్లి పాతికేళ్ల లోపు చేసుకుంటేనే అందులో సుఖాన్ని ఆస్వాదించవచ్చు. ముప్పై ఏళ్లు దాటాక చేసుకుంటే అందులో మనకు నిస్సారమే కనిపిస్తుంది. ఎందుకంటే ముప్పై ఏళ్లు దాటాక మనం కెరీర్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.

ఉద్యోగ నిర్వహణ ఓ సవాలుగా మారుతుంది. ఈ తరుణంలో సంసారంపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితిని మరిచిపోతుంటారు. ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి. దీంతో కట్టుకున్న భార్యకు ఇబ్బందులు తప్పవు. మన స్వార్థం కోసం వారిని బలి చేయాల్సి వస్తుంది. అందుకే పెళ్లి తొందరగా చేసుకుంటేనే ప్రయోజనం కలుగుతుందని గుర్తుంచుకోవాలి.

ముప్పై ఏళ్ల తరువాత ఒకరిపై ఒకరికి ఆకర్షణ తగ్గుతుంది. ఇతర విషయాలపై ఆసక్తి కలుగుతుంది. దీంతో సంసారాన్ని పట్టించుకోరు. సామాజిక విషయాలపై కూడా దృష్టి పెరుగుతుంది. సమాజంలో గౌరవ హోదాల కోసం పనిచేయాల్సిన సమయం కావడంతో కుటుంబ విషయాలను అంతగా పట్టించుకోం. దీంతో భార్య అసహనానికి గురవుతుంది. భర్త తీరును తప్పుబడుడుతుంది. ఫలితంగా ఇద్దరి మధ్య మనస్పర్దలు చోటుచేసుకుని ఘర్షణలకు దారి తీస్తుంది.

ఈ నేపథ్యంలో ఇరవై ఐదు ఏళ్ల వరకు పెళ్లి చేసుకుంటేనే సంసార సాగరంలో మంచి ఫలితాలు వస్తాయి.ముప్పై దాటిన తరువాత డబ్బు సంపాదనపై గురి పెరుగుతుంది. పుట్టిన పిల్లల కోసం బాగా సంపాదించాలనే యావలో దేన్ని కూడా పట్టించుకోడు.

దీంతో దంపతుల మధ్య కలతలు ప్రారంభమవుతాయి. కెరీర్ ను కాపాడుకుంటూ డబ్బు సంపాదన కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. దీంతో వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టడం కష్టమైపోతుంది. దీంతో ఇద్దరి మధ్య చీటికి మాటికి ఏవేవో సూటిపోటి మాటలతో నవ్వుల పాలవుతారు.

భవిష్యత్ పై బెంగతో ఉన్న జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతారు. నిత్యం సమస్యలతో సతమతమవుతుంటారు. దీంతో వైవాహిక జీవితం పట్ల ప్రత్యేక సమయం కేటాయించలేకపోతారు. దీని వల్ల సమస్యలు చుట్టుముడతాయి. పక్కదారులు తొక్కే ప్రమాదాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు ఇరవై నాలుగేళ్ల నుంచి ఇరవై ఆరు ఏళ్ల మధ్య వివాహం చేసుకుంటేనే అన్ని అనుకూలంగా మారుతాయి. లేదంటే కష్టాలు తప్పవు. అందుకే బ్యాచిలర్స్ బీ కేర్ ఫుల్. జాగ్రత్త పడండి. కలతలు లేని సంసారం కోసం కలలు కనండి. దాన్ని సాకారం చేసుకోండి.

Leave a Reply