Singer Sunitha: 43 ఏళ్ల వయసులో మళ్లీ ప్రెగ్నిన్సీ వార్తల పై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత!

సింగర్ సునీత.. ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో అని ప్రేయసి ప్రియులను తన్మయత్వానికి గురిచేసినా.. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అని పాటల కానుకను అందించినా.. అది ప్రముఖ సుప్రసిద్ద గాయనీ సునీత (Singer Sunitha) కే సాధ్యం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె పాడిన పాటల జలపాతంలో చాలా మంది తడిసి ముద్దైన వాళ్లు ఉంటారు.

Singer sunitha instagram

ఆమెను స్పూర్తిగా తీసుకొని తమ స్వరాన్ని సరైన శిక్షణతో సవరించుకొని పాటలు పడేందుకు సినీ రంగంలోకి అడుగు పెట్టిన వారూ లేకపోలేదు. ఆమె జీవితం మృదువైన పుష్పాలు పరిచిన పరిమళాల బాట కాదు. జీవితం అనే సంద్రంలో చాలా ఆటుపోట్లు ఎదురైనప్పటికీ చెక్కు చెదరని చిరునవ్వుల ఒడను సాధనంగా చేసుకొని జీవనయానం సాగిస్తున్నారు.

సింగర్ సునీతరెండేళ్ల క్రితం వ్యాపారవేత్త, మ్యాంగో మ్యూజిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకుంది. 42 ఏళ్ల వయసులో ఆమె రెండో పెళ్లి చేసుకోవడం అప్పట్లో సెన్సేషనల్ అయింది.


Singer sunitha instagram

ఈ క్రమంలో తాజాగా ఆమె గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. సునీత మళ్లీ గర్భవతి అయింది అనేదే ఆ వార్త. ఈ వార్తపై సునీత స్పందిస్తూ… ‘ఔనా.. నేను ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలియదే’ అని సరదాగా వ్యాఖ్యానించింది. ఈ వార్త తనకు గానీ, తన జీవితానికి కానీ సంబంధించినది కాదని తెలిపింది. ఇలాంటి రూమర్లను సృష్టించిన వారి ఆలోచన స్థాయికి చెందినదని విమర్శించింది.

Leave a Reply