TTD Chairman | పులి వ‌స్తే క‌ర్ర‌తో కొట్టండి.. టీటీడీ చైర్మ‌న్‌ షాకింగ్ కామెంట్స్.

TTD Chairman | గత కొంతకాలంగా తిరుమలకు వెళ్ళే భక్తులపై చిరుతపులులు దాడి చేస్తున్నాయి. ఆ పులులను పట్టుకునేందుకు అటవీసాఖ అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు చేస్తూన్నారు. మరోవైపు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆగస్టు 14, 2023 ఉదయం టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు రోజు, తర్వాత రోజు పులులు మెట్లదారి వద్ద కనిపించటంతో.. టీటీడీ బోర్డ్ కొన్ని నిర్ణయాలను తీసుకుంది.

అందులో ఒకటి.. మెట్లదారిలో వెళ్ళే భక్తుల చేతికి కర్ర ఇవ్వటం. సెక్యూరిటీ గార్డులు ముందు వెనుక నడుస్తున్నప్పటికీ భక్తుల వద్దకూడా కర్ర ఉండటం వల్ల ఎంతోకొంత ఉపయోగం ఉంటుందని ఆ నిర్ణయం తీసుకున్నామని కరుణాకర రెడ్డి చెప్పారు.భక్తులకు చేతికర్రలు ఇచ్చే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ‘ఎస్వీ జూ పార్కు నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నారు’.

‘చిరుత పులిదాడిని కర్రతో నివారించొచ్చా’ అంటూ టీటీడీ నిర్ణయంపై ట్రోల్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను ఖండించారు. అటవీశాఖ అధికారుల సూచనల మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.

కొందరు కావాలనే టీటీడీ నిర్ణయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తిరుమల నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని భూమన అన్నారు.12ఏళ్లలోపు వయస్సున్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అలిపిరి మెట్ల మార్గం నుంచి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. పెద్దలను రాత్రి 10గంటల వరకు అనుమతిస్తామని తెలిపింది.

Leave a Reply