Vaishnavi Chaitanya | పాకెట్ మనీ కోసం వైష్ణవి చైతన్య ఏం చేసేదో తెలుసా..?

Vaishnavi Chaitanya | హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్‌ (Sai Rajesh) దర్శకత్వం వహించిన చిత్రం బేబి (Baby). ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌లో మెరిసి సూపర్ క్రేజ్‌ సంపాదించింది విజయవాడ సుందరి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). బేబి ప్రాజెక్ట్‌లో తన పాత్రలో జీవించేసి.. మెగాస్టార్‌ చిరంజీవి లాంటి లెజెండరీ యాక్టరే స్వయంగా తనను సహజనటి జయసుధతో పోల్చే స్థాయికి చేరుకొని.. టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.బేబి వైష్ణవి చైతన్య కెరీర్‌ను మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బేబి సినిమాతో అగ్రదర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ భామ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చి చేరాయన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం వైష్ణవి చైతన్య మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.అది పక్కన పెడితే ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను పడ్డ కష్టాలను తెలిపింది.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. నేను పదవ తరగతి చదువుతున్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను తీసుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది కేవలం డాన్స్ మాత్రమే.. బర్తడే, పెళ్లి లాంటి ఈవెంట్స్ లో డాన్స్ చేసేదాన్ని.. ఎక్కువగా రాత్రులు బర్తడే పార్టీలు జరిగేవి వాటిలో డాన్స్ చేస్తే 700 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుతో మా అమ్మ బియ్యం కొనుక్కొని వచ్చేది. ఇక యూట్యూబ్ లో వీడియోలు చేయడానికి కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి ప్రత్యేక గది కూడా ఉండేది కాదు.

వాష్ రూమ్ కి వెళ్లి దుస్తులు మార్చుకునే దాన్ని . ఇక అదంతా చూసి అమ్మ ఏడుస్తూ ఎందుకమ్మా ఇదంతా వద్దు వదిలేయని బాధపడింది. అయినా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అయితే ఒకసారి ఒక సినిమాలో చిన్న పాత్ర చేశాను. మనకంటూ క్యారవాన్ ఉండదు కాబట్టి పెద్ద ఆర్టిస్ట్ దగ్గరకు వెళ్లి వాష్ రూమ్ కోసం మీ క్యారవాన్ వాడుకోవచ్చా అని అడిగితే ఆమె నానా మాటలు అన్నది. అప్పుడు ఏడుపు ఒక్కటే మిగిలింది ఈ సంఘటన నన్ను చాలా బాధ పెట్టింది. కానీ వాటన్నింటినీ పట్టించుకోలేదు అంటూ ఆమె తెలిపింది.

Leave a Reply