Vijay Deverakonda | ఫ్యాన్స్‌కు విజయ్‌ కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి

Vijay Deverakonda | టాలీవుడ్‌ స్టార్‌ నటులు విజయ్‌ దేవరకొండ,సమంత (Samantha) జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి (Kushi). రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఐదేళ్ల తర్వాత విజయ్ దేవరకొండకు మళ్లీ సూపర్ హిట్‌ పడ్డట్టు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ చెబుతున్నాయి.

లైగర్‌ డిజాస్టర్‌ తర్వాత మంచి సక్సెస్‌ అందుకోవడంతో విజయ్‌ దేవరకొండ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో విజయ్‌ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఖుషి చిత్రం ద్వారా తాను సంపాదించిన మొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకుఇవ్వనున్నట్లు ప్రకటించారు.దీంతో ఆయన అభిమానులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. పదిరోజుల్లొ 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయల చొప్పున తానే స్వయంగా అందిస్తానని విజయ్ అన్నారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి
‘నా సక్సెస్‌లో, నా హ్యాపీనెస్‌లో మీరు భాగం పంచుకోవాలి. నా సంపాదనను మీతో షేర్ చేసుకోలేకపోతే అంతా వేస్ట్. మీరంతా నా ఫ్యామిలీనే.. దేవర ఫ్యామిలీ, స్ప్రెడింగ్ ఖుషి అని సోషల్ మీడియాలో ఒక అప్లికేషన్ ఫార్మ్ పెడతా. ఇది ఎలా చెయ్యాలో తెలియదు కానీ, అవసరం ఉన్నవాళ్లకి ఏ హెల్ప్ చేసినా నాకు సంతోషమే. మీరు ఉంటున్న ఇంటి రెంట్‌, పిల్లల స్కూల్‌ ఫీజులు ఇలా కొంతైనా నా సాయం ఉండాలనుకుంటున్నా..

నా సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరాలు తెలుపుతా.. ఆర్థికసాయం కావాల్సిన వారు అభిమానులతో పాటు ఎవరైనా దరఖాస్తు చేసుకోండి.. వాటిలో 100 ఫ్యామిలీలను ఎంపిక చేసుకొని సరిగ్గా పదిరోజుల్లొ ఈ మొత్తాన్ని అందజేస్తా. అప్పుడే నాకు ఖుషి సక్సెస్ సంపూర్తి అవుతుంది.’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

Leave a Reply