allroudadda

Ysr Asara | ఏపీలో ఆసరా పథకం ప్రారంభం.. డ్వాక్రా మహిళల అకౌంట్లలో డబ్బు జమ..

Ysr Asara | ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులను విడుదల చేసింది . అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిచారు.ఇప్పటివరకు నాలుగు విడతల్లో రూ.19,175.97 కోట్లు చెల్లించిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం…. మిగిలిన రూ.6394.83 కోట్లను 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. దీంతో ఏపీలోని డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబుకు మంచి చేసిన చరిత్ర లేదని, ఆయనదంతా మోసాల చరిత్రేనని ధ్వజమెత్తారు.రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమానులు.. ఆయనను జాకీ పెట్టి లేపేందుకు కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్ కలిగిన దత్తపుత్రుడు, పక్క పార్టీలో ఉన్న చంద్రబాబు వదిన స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని అన్నారు.

allroudadda
allroudadda

తనకు స్టార్ క్యాంపెయినర్లు లేరని జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారని.. 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు తనకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని ప్రకటించారు. మీకు మంచి జరిగితే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. జనమే తన స్టార్ క్యాంపెయినర్లు అని, తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే ఎవరికి లేరని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అని ప్రకటించారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

  చెల్లెలు నిశ్చితార్థ వేడుకల్లో సాయి పల్లవి తీన్మార్ డాన్స్…

ఎటువంటి వివక్ష లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 79 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరనుందని చెప్పారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని, ఈ విషయంలో ఏపీ ముందుందని తెలిపారు. ప్రతి అడుగులో కూడా మహిళల సంతోషం కోసమే తమ ప్రభుత్వం తపన పడుతోందన్నారు. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని విమర్శించారు. మహిళలు రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.

Leave a Reply