Aadhaar New Update | ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త, ఇంకా 2 వారాలే ఉంది ..?

Aadhaar New Update | ప్రభుత్వం ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఆధార్ కార్డులోని డెమోగ్రాఫిక్స్ తో పాటు అడ్రస్ లో మార్పు, ఫోన్ నంబర్ వంటివి అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. అది కూడా ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగానే అప్ డేట్ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ కూడా ప్రజలను కోరుతోంది. డెమొగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అప్‌డేట్ చేసుకోవాలని కోరుతోంది. ఆన్‌లైన్‌లో ఉచితంగానే ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చని తెలియజేస్తోంది. సెప్టెంబర్ 14 వరకు ఉచిత ఆధార్ అప్‌డేట్ సేవలు అందుబాటులో ఉంటాయి.

అంటే ఇంకో రెండు వారాలు సమయం కూడా లేదు.అందువల్ల మీరు ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తే.. వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం ఉత్తమం. సాధారణంగా అయితే జూన్ 14 నాటికే ఆధార్ అప్‌డేట్ సర్వీసుల ఉచిత అప్‌డేట్ ముగియాల్సి ఉంది. అయితే యూఐడీఏఐ మాత్రం ఈ గడువును సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. అంటే మీకు ఇంకో 12 రోజులు ఉన్నాయి. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్‌కు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

Aadhaar New Update
Aadhaar New Update

అదే మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లాలని భావిస్తే.. అప్పుడు చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది.అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి మీరు ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. డెమొగ్రాఫిక్ వివరాలను మార్చుకోవచ్చు. ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగానే పొందొచ్చు. వివరాలు కరక్ట్‌గా ఉంటే సులభంగానే స్కీమ్స్‌లో చేరొచ్చు. ఎలాంటి ఇబ్బందులు రావు.

Aadhaar New Update
Aadhaar New Update

లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వివరాలు అప్‌డేట్ చేసుకోవడానికి కష్టపడాల్సి రావొచ్చు. అందుకే ఆధార్ వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. కాగా ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలన్నా ఆధార్ కార్డు కావాలి.అందుకే ఆధార్ వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. ఇంకా ఇతర డాక్యుమెంట్లకు కూడా ఆధార్ కార్డు ఇప్పుడు ప్రామాణికంగా ఉంది. అందుకే మీరు ఆధార్ వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. ఆధార్ కార్డు కలిగని వారు 1700కు పైగా గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ప్రాజెట్ల నుంచి బెనిఫిట్ పొందొచ్చని యూఐడీఏఐ పేర్కొంటోంది.

Leave a Reply