Ambani | ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ మళ్లీ బరువు పెరగడానికి కారణమేంటో మీకు తెలుసా …!

వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(Mukesh Ambani), నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త్వ‌ర‌లోనే అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త‌న ప్రియ స‌ఖి రాధికా మర్చంట్ తో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. అనంత్- రాధికల నిశ్చితార్థం ఇటీవల అత్యంత ఘ‌నంగా జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

అయితే ఈ పిక్స్ లో అనంత్ అంబానీ(Anant Ambani)ని చూసి అంద‌రూ షాక్ అయిపోయారు. అనంత్ అంబానీ భారీ కాయంతో కనిపించడంతో ఖంగుతిన్నారు. నిజానికి 2016కు ముందు అనంత్ అంబానీ 200 కిలోల బరువు ఉండేవారు. అయితే 2016లో ఆయన ఏకంగా 108 కిలోలు బ‌రువు త‌గ్గాడు. ప్రతిరోజూ ఐదు నుంచి ఆరు గంటల పాటు వ్యాయామం చేశాడు.యోగాతో పాటు కార్డియో వ్యాయామాలు ఆచరిస్తాడు.

అలాగే ఆహార నియమాలు పాటించి బ‌రువు త‌గ్గాడు. సూప‌ర్ స్లిమ్‌గా మారి హీరో మాదిరిగా ద‌ర్శ‌న‌మిచ్చాడు. అప్ప‌ట్లో ఆయ‌న స్లిమ్ లుక్ అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంది. కానీ, ఇప్పుడు అనంత్ అంబానీ(Anant Ambani) మ‌ళ్లీ భారీగా బ‌రువు పెరిగిపోయాడు. ఈయ‌న ఎంగేజ్మెంట్ ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు.. చాలా మంది అనంత్ పై బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేశారు.

అయితే 2016లో 108 కేజీలు తగ్గిన అనంత్ అంబానీ మ‌ళ్లీ బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా.. స్టెరాయిడ్స్ వాడ‌కం. అవును, అనంత్ అంబానీ తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డాడు. దీనికి చికిత్సలో భాగంగా కొన్ని స్టెరాయిడ్లు తీసుకున్నాడు.

అయితే స్టెరాయిడ్లు దుష్ప్రభావాల కారణంగానే అనంత్‌ మళ్లీ బరువు పెరిగాడు. ఈ విష‌యాన్ని అనంత్ అంబానీ త‌ల్లి నీతా అంబానీ(Nita Ambani) స్వయంగా వెల్ల‌డించాడు. అంతేకాకుండా త‌న కుమారుడిపై బాడీ షేమింగ్ కామెంట్లు చేసేవారికి ఆమె హెచ్చరిక సైతం జారీ చేశారు.

Leave a Reply