స్టార్ హీరోతో ఎఫైర్ ఉందని పోలీస్ కేస్ లో దొరికానని ప్రచారం చేశారు..! ఝాన్సీ ఎమోషనల్

తొలితరం స్టార్ యాంకర్స్ లో ఝాన్సీ ఒకరు. కేబుల్ టీవీ వచ్చాక పలు ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయి. యాంకరింగ్ ఆఫర్స్ పెరిగాయి. సుమ, ఉదయభాను, ఝాన్సీ వంటి వారు సత్తా చాటారు. టాక్ ఆఫ్ ది టౌన్ షో ఝాన్సీకి మంచి ఫేమ్ తెచ్చింది. అలాగే పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరించారు. అదే సమయంలో నటిగా మారి సక్సెస్ అయ్యారు. అయితే ఝాన్సీ జీవితంలో కొన్ని వివాదాలు ఉన్నాయి.

ఆమె నటుడు జోగి నాయుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక కూతురు పుట్టాక ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో విడిపోయారు.ఇప్పటివరకు తన జీవితంలో తనను తీవ్రంగా బాధపెట్టిన పుకార్లపై ఆమె ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ఒక హీరోతో ఎఫైర్ పెట్టుకున్నాను అంటూ వార్తలు రాశారు అలాగే పోలీస్ రైడ్ లోదొరికిపోయాను అంటూ వార్తలు రాశారు.

ఇలా నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తి గురించి ఈ విధమైనటువంటి అసత్యపు వార్తలు రాస్తే వారు ఎంత మానసికక్షోభకు గురవుతారనే విషయాన్ని పట్టించుకోరని ఈమె తెలియజేశారు.ఇలా ఝాన్సీ తన గురించి వార్తలు రాశారని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి అయితే ఏ హీరోతో ఈమె ఎఫైర్ పెట్టుకుందనే విషయం గురించి కూడా ఆరా తీస్తున్నారు అయితే ఈమె నాగార్జునతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ అప్పట్లో ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.

Leave a Reply