ఈ మూడు రాశుల వారికి అన్నీ కష్టాలే.. తస్మాత్ జాగ్రత్త..!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థానం దిశా కదలికలు అనేది చాలా ముఖ్యమైనవి. ఒక వ్యక్తి పుట్టిన సమయంలో ఆకాశంలో ఉన్న గ్రహాల స్థానాలు వారి జీవితాన్ని , భవిష్యత్తును కూడా గణనీయంగా ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. అదేవిధంగా వేద జ్యోతిష్య శాస్త్రంలో ఒక రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికనే యుతి లేదా సంయోగం అని అంటారు. ఇకపోతే జూన్ 3న బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే మేషరాశిలో రాహు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మేషరాశిలో బుధుడు రాహు కలయికతో గురుచండాలయోగం ఏర్పడింది.

మేష రాశి:
36 సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ గురు చండాల యోగం మేషరాశిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరులతో మాట్లాడే సమయంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. వాదనలకు దూరంగా ఉండాలి.

మిధున రాశి:
గురు చండాల యోగం వల్ల ఈ రాశి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. డబ్బు లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కర్కాటక రాశి:
ఈ రాశి వారికి గురు రాహు కలయిక కష్టాలను తెస్తుంది ఏ పని మొదలుపెట్టినా ఇబ్బందులు కలుగుతాయి, జీవితం మొత్తం ఒడిదుడుకులకు లోనవుతారు. శత్రువులు కుట్ర వల్ల ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడు రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.

Leave a Reply