YS Sharmila | సజ్జల మూసుకొని మీ పని మీరు చూస్కోండి.. షర్మిల ఫైర్

YS Sharmila

YS Sharmila | వైస్సార్టీపీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తాజాగా షర్మిల ప్రకటించారు. దీని పైన వైసీపీ నేతలు స్పందించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. అదే విధంగా తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం విషయంలో కొందరు నేతలు అడ్డు పడ్డారంటూ పరోక్షంగా రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని అనుకున్నామని.. కొంత మంది వాళ్ళ స్వార్థం కోసం పార్టీ విలీనం కాకుండా అడ్డుకున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకౌంటర్ ఇచ్చారు. ఏపీ పరిస్థితి ఎలా ఉందో సీఎం కేసీఆర్ ప్రతీ బహిరంగ సభలో చెప్తున్నారని.. ముందు సజ్జల దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఒకప్పుడు తాను పార్టీ పెడితే తెలంగాణాలో షర్మిలకు ఏం సంబంధం అని సజల్జ అన్నారని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలతో తనకు సంబంధం ఉందని సజ్జల ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఏపీ పరిస్థితిపై అక్కడి నేతలు ఆలోచిస్తే మంచిది తెలంగాణ గురించి వాళ్లకు అనవసరమన్నారు.

YS Sharmila | చీకటయితే ఆంధ్రా,వెలుగైతే తెలంగాణ

దీనిపైన సజ్జల ఎలా స్పందిస్తారో, షర్మిలకు ఎటువంటి జవాబిస్తారో చూడాలి మరి. అసలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగానే డబుల్ రోడ్ అయితే తెలంగాణ అదే సింగల్ రోడ్ అయితే ఆంధ్రా.., చీకటయితే ఆంధ్రా,వెలుగైతే తెలంగాణ అంటూ చేసిన వ్యాఖ్యలకి ముందు సమాధానం చెప్పండి. మీ సంగతి మీరు చూసుకోండి మా గురించి మాకు తెలుసు అంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చారు వైస్ షర్మిల. ఈ సమాధానం సజ్జలకేనా…లేక ఏపీ ముఖ్యమంత్రికి కూడానా అన్న ఆప్రశ్నకు ఎవ్వరికైనా ఇదే రిప్లై ఓకేనా అంటూ వెళ్లిపోయారు షర్మిల.

Leave a Reply