Bhanu priya | అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి భానుప్రియ…

allroudadda

Bhanu priya | 1980 లలో టాలీవుడ్‌లో నటి భానుప్రియ ఒక వెలుగు వెలిగారు. తన కెరీర్‌లో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో మూవీస్ లో నటించారు. ఎన్నో గొప్ప పాత్రలను పోషించారు. అందం, అభినయంతో పాటు డాన్స్ టాలెంట్ ఆమెకు ఉన్న అదనపు క్వాలిఫికేషన్.. ఆమెతో చేసిన ఎంతో మంది ఇప్పటికీ లైం లైట్ లో కనిపిస్తూనే ఉన్నారు. కానీ భానుప్రియ మాత్రం ఎందుకు కనిపించడం లేదు…అసలు ఆమె ఎక్కడ ఉన్నారు అనే ఎన్నో ప్రశ్నలు ఆమె ఫాన్స్ నుంచి వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు భానుప్రియ. “నేను చేసిన సినిమాల్లో నాకు ఎక్కువగా నచ్చేవి సితార, అనాదిగా ఆడది, స్వర్ణకమలం..స్వర్ణ కమలం మూవీకి నంది అవార్డు గెలుచుకున్నా. ఐతే ప్రస్తుతం వయసు పెరగడంతో నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు.. అన్ని విషయాలు మర్చిపోతున్నాను. నేను ఒక డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టాలి అనుకున్నా..కానీ డాన్స్ చాలా వరకు మర్చిపోయాను అందుకే ఈ డాన్స్ స్కూల్ ఆలోచనను విరమించుకున్నా.

allroudadda
allroudadda

రీసెంట్ గా ఒక మూవీ షూటింగ్ కి వెళ్ళాను అక్కడ చెప్పాల్సిన డైలాగ్స్ అన్నీ మర్చిపోయా..మైండ్ బ్లాంక్ ఐపోయింది. తర్వాత కొంచెం సర్దుకున్నాక మళ్ళీ చెప్పాను. ‘నాట్యం’ అనే మూవీలో నటించాను. నా పాత్ర చాలా బాగుంటుందనీ చెప్పారు కానీ అది చేసాక అర్ధమయ్యింది నా క్యారెక్టర్ కి అంత వేల్యూ లేదు అని అప్పుడు మాట్లాడితే గొడవలవుతాయని నేనేమీ మాట్లాడలేదు. నా భర్త చనిపోయాక నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నేను మా వారితో డివోర్స్ తీసుకోవడం అనేది రూమర్ మాత్రమే…నాకు షూటింగ్స్ ఉంటే చెన్నై, హైదరాబాద్ వెళ్లి వస్తూ ఉంటాను.

పేదలకు శుభవార్త.. 29 రూపాయలతోనే కిలో బియ్యం..

మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. మా అమ్మాయి అభినయ లండన్ కాలేజీలో నేచురల్ సైన్స్ చదువుతోంది. నాతోటి వాళ్లంతా హైదరాబాద్ షిఫ్ట్ ఇపోయారు కానీ నేను మాత్రం చెన్నైలోనే ఉండిపోయాను…అక్కడికి వెళ్లడం మీద పెద్దగా ఇంటరెస్ట్ చూపించలేదు నేను హైదరాబాద్ వెళ్లి అక్కడ మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయాను. నేను, అమ్మ, అన్నయ్యను, అభినయ ఇక్కడ ఉంటాం..శాంతిప్రియా వాళ్ళ అబ్బాయిలు ముంబైలో ఉంటారు. వాళ్ళు మేము కలుస్తూనే ఉంటాం..” అని చెప్పుకొచ్చారు భానుప్రియ.

Leave a Reply