Pallavi Prashanth | బుల్లితెరపై మొదటిసారి బిగ్ బాస్ లోకి సాధారణ రైతు… ఇతని అసలు కధ ఇదే..

Pallavi Prashanth | బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్( Bigg Boss ) రియాలిటీ షో ఒకటి.బిగ్ బాస్ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది.ఇక తెలుగులో ఇప్పటికే ఈ కార్యక్రమం ఆరు సీజన్లను పూర్తి చేసుకొని, తాజాగా ఆదివారం సాయంత్రం ఏడవ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే.

Pallavi Prashanth

ఇలా నాగార్జున( Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఒక్కో కంటెస్టెంట్ ను హౌస్ లోపలికి పంపించారు.ఇకపోతే ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో కూడా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా రైతు పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth )కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.ఈయన ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం ఒక సాధారణ రైతుగా మొదటిసారి ఈ సీజన్లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు.

Pallavi Prashanth
Pallavi Prashanth

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో రైతుగా (Farmer) పాల్గొన్నటువంటి పల్లవి ప్రశాంత్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఈయన ఒక సాధారణ రైతు తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ద్వారా అందరితో పంచుకునేవారు.ఈ విధంగా యూట్యూబ్ ఛానల్( YouTube channel ) ద్వారా వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ రోజురోజుకు ఎంతోమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.

Pallavi Prashanth
Pallavi Prashanth

అయితే ఈయన గత మూడు సీజన్లో నుంచి తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆసక్తిగా ఉందని తనకు ఒక అవకాశం కల్పించాలి అంటూ పలు సందర్భాలలో వేడుకున్నారు.అయితే ఈయనకు ఈ కార్యక్రమం పట్ల ఉన్నటువంటి ఆసక్తి తెలుసుకున్నటువంటి నిర్వాహకులు ఈయనని ఈసారి కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి తీసుకువచ్చారు.పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్ వారానికి లక్ష రూపాయలు ఉందంట. ఆయన ఎన్ని వారాలు హౌస్ లో ఉంటే అన్ని లక్షలు వస్తాయన్నమాట. మరి పల్లవి ప్రశాంత్ ఎన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతాడో చూడాలి.

Leave a Reply