Heavy Rains | తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు భారీ వర్ష సూచన.

Heavy Rains

Heavy Rains |తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరితల అవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా తెలంగాణలో మరో ఐదు రోజులు, ఏపీలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వానలతో పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మరో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. నేడు జగిత్యాల, వికారాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఐఎమ్‌డీ హెచ్చరించింది.

ఆంధ్రాలో రెండు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది ఐఎండీ. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇష్యూ చేసింది. అసలు ఏఏ జిల్లాలకు ఏ వార్నింగ్‌ ఉందో చూద్దాం.ఆరెంజ్‌ అలర్ట్‌ – శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజుఎల్లో అలర్ట్‌ – విశాఖ, ఏలూరు, పార్వతీపురం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌ జిల్లా, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, పుట్టపర్తి, చిత్తూరు

Leave a Reply